స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Saturday, 31 December 2016

ఇంకో ఏడాది ,ఇంకో అడుగు 2017

ఇంకో ఏడాది ,ఇంకో అడుగు 2017

వెళుతూనే ఉంటాము 
ఒక్కో అడుగుగా కాలాన్ని కొలుస్తూ 
ఎవరో ఒకరు మన కోసం 
ఒక మంచి విష్ ఇస్తారని 
ఒక్క స్నేహం కోసం 
మన జయాపజయాలలో 
వెతుకులాట 

తెలిసిపోతూనే ఉంటుంది 
లోపలికి బయటకి జరిగే ఘర్షణ 
ఒక్క అహాన్ని కాపాడటానికి 
మనమే ఆయుష్షూ గుప్పెట నుండి ఇసుకలా జారుతూ ఉంటాము 

పడుతూ లేస్తూ వెళుతున్నాము 
అంటే బహుశా ఇది అందరు వెళ్లే దారి కాదేమో !

ఫర్లేదు , అందరికీ తప్పులే కనిపిస్తున్నా 
దేవుడు మన చేత ఇంకో దారి నిర్మిస్తున్నాడేమో 
సంతోషమే  అందరికి తెలుస్తుంది 
లోపలి సంగతి ఎవరికి తెలుసు 

అదే కదా ఇప్పుడు అక్షారాలుగా 
భావాల్ని మోసుకుంటూ ఖదీర్ కలం లో ....... 

దర్గా మిట్ట కథలు , పోలేరమ్మ బండ కథలు 
ఇప్పుడు ఒకే తేగలో రెండు చందమామలుగా 
ఒకే పుస్తకం లో 

ఇంకో సారి హాయిగా దూకేయ్యండి 
మీ బాల్యం  లోకి ఎందుకు ఆలశ్యం ?

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2017 




Monday, 7 November 2016

సూర్య లంక లో కథ ల కబుర్లు

మబ్బులో అయినా మనిషిలో అయినా
నలుపు ఉంటుంది
కాని కలం మెరుపులు అద్దుకొని
వర్షిస్తే
అక్షరాలకు జీవం పోసి
జీవితాలకు రూపం ఇస్తే
కథ రాకా తప్పదు
దానికి మనం కై మోడ్చక తప్పదు

రెండు దశాబ్దాలుగా ఖదీర్ గారు సురేష్ గారు
చేస్తున్న ఈ కథ కబుర్ల యజ్ఞం ఈ మధ్య
సూర్య లంకలో , కబుర్లు మీరే చూడండి




Tuesday, 18 October 2016

తే గలు ....కొంచెం జ్ఞాపకాలు


ఊపిరాడని ట్రాఫిక్ మధ్య 
మోయలేని బాధ్యతల మధ్య 
ఎప్పుడూ మనిషికి కొంచెం ఆక్సిజన్ కావాలసిందే 
అది నాస్టాల్జియా అయినా ఫర్లేదు 
కొంచెం సేపు ఎస్కెప్  

మరి బాల్యపు జ్ఞాపకాలే లేని నేటి తరం పరిస్థితి
ఇంతకీ కొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవడం 
అమ్మ నేర్పాల్నా ? నాన్న నేర్పాల్నా ? 
సున్నితమైన బంధాల్ని రూల్స్ గా చేస్తున్న 
సుప్రీం కోర్ట్ ని అడగాలసిందే !

ఇప్పుడు ఖదీర్ కలం నుండి జాలువారిన 
చందమామ వెంట నడిచిపోండి .
"తే గలు" కథ ఫండే లో .
Link for story




Wednesday, 13 July 2016

ఇంకో భాష కి ఒక అడుగు

ఒక్క దగ్గరే ఉండిపోవడం 
ఏమి బాగుంటుంది అని 
నది అయినా కధ అయినా 
ఇంకో బాష వాళ్లకి ఆ మాధుర్యం 
అందవద్దా అనువాదకుల కలం 
లో ప్రవహించి 
మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ తన తాజా 
300 పేజీల ఓనమ్ సాహిత్య సంచికలో ‘న్యూ బాంబే టైలర్స్’
 కథను ప్రచురించింది. అర్థవంతమైన బొమ్మలతో ఈ కథను
 ప్రెజెంట్ చేస్తూ భారతీయ భాషలలో వచ్చిన 
అత్యుత్తమ కథల్లో ఇది ఒకటిగా మెచ్చుకుంది. 
మాతృభూమి లోకల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి
 నాకు ఈ విషయం చెప్పారు. 
అనువాదకుడు ఎవరో తెలియదు. ...ఖదీర్ బాబు 


నవ్వుల నెలవంకలు మెరవక పొతే ఈద్ ఎలా వస్తుంది ?
జ్ఞాపకమయి ఎలా మెరుస్తుంది ?



Tuesday, 21 June 2016

ఒక లెసెన్

ఒక లెసెన్
అనుకుని ఉంటాడా 
కావలి వీధుల్లో ఆడుతూ అల్లరిగా తిరిగే 
ఆ బక్క పలుచటి అబ్బాయి 
తన జీవితం లోని ఒక ముక్క
భవిష్యత్తులో తన కలం నుండి జాలువారి 
తన వాళ్ళ ప్రతిబింబాన్ని లోకానికి చూపిస్తుందని !
తానే పంతులయి మిగిలిన ఆచార్యులకు దానిపై 
వివరిస్తాను అని 

ప్రతి శిశువు లో ఉన్న సార్ధకత దేవుడు ఎప్పుడో 
పొదిగి ఉంటాడు . 

తన దర్గా మిట్ట కథ లెసెన్ గా పొందుపరచినందుకు 
ఖదీర్ బాబు కు అభినందనలు 






Sunday, 29 May 2016

కుదిరితే నాలుగు మాటలు

కుదిరితే నాలుగు మాటలు 
అని ''బ్రహ్మోత్సవం ''టీం అలా 
అడిగారో లేదో ఇలా కుదిరించుకొని 
మాట సహాయం చేసారు ఖదీర్ గారు 

మరి ఈ దర్శక రత్న గారు కధల బుక్ చదివినాక 
ఏ జస్టీస్ చౌదరికి వ్రాస్తారో !
''నాటా '' సాహిత్య సమావేశాలకు వెళుతున్నందుకు ఖదీర్ గారికి అభినందనలు 

ఆ కధల బుక్ గురించి బ్లాగర్ వనజ తాతినేని గారి అభిప్రాయం చూడండి . 



"కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన ఉత్తేజం, మిగిల్చిన అనుభూతి, ఏర్పడిన నా అవగాహన ఇది.
మహ్మద్ ఖధీర్ బాబు గారికి వైభోగం పట్టుకుంది . ఇది నేనన్న మాట కాదు ఆయన మాటల్లోనే! లేకపోతే మిట్ట మధ్యాహ్నం మండి పోయే మా బ్లేజ్ వాడ పుర వీధుల్లో ఏలూరురోడ్ లో విశాలాంధ్రని వెదుక్కుంటూ నేను వెళ్ళడం ఏమిటీ ?
నిజంగా పాఠకులు ఒక పుస్తకం కోసం వెదుక్కుంటూ వెళ్ళడం అంటే కచ్చితంగా అది రచయితకి పట్టిన వైభోగమే! అలా విశాలాంధ్ర లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట మాట్లాడిన మాట ఖదీర్ బాబు గారి కొత్త పుస్తకం ఉందా ? ( మనసులో వీళ్ళు గనుక లేవండీ అంటే మళ్ళీ లైన్ లో ఉన్న షాప్ లన్నీ వెతుక్కోవాలి అన్న భయం ఉంది లోలోపల)
"ఉందండీ" అంటూ అందరికీ కనబడేటట్టు పెట్టి ఉంచిన బుక్ తీసుకొచ్చి ఇచ్చారు . హమ్మయ్య ఒక పని అయిపొయింది అనుకుంటూ ఇంకొన్ని పుస్తకాల కోసం వెదుకుతూ ఒక పావుగంట శీతల పవనాలని ఆస్వాదించి కొన్ని కొసరు పుస్తకాలు కొనుక్కుని బయట పడ్డాను.
ఆరోజు సాయంత్రమే చదవడం మొదలెట్టాను .
కథలు ఎవరు వ్రాస్తారు ? జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు , రోజూ వారి పనులు విషయాలు గుర్తు పెట్టుకోలేని వాళ్ళు , చిలవలు పలవులు ఊహించుకునే వాళ్ళు. నాకు రుజువు దొరికేసింది చెల్లెలు పుట్టినరోజున ఎదురుగా కొత్తబట్టల్లో కనబడినా ఆ సంగతే గుర్తు ఉండదు చిన్నప్పుడెప్పుడో నాయనమ్మ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మెదడు.
కథ వ్రాయడానికి ముందు ఏం వ్రాస్తారు? అవును .. నేను ఏమి వ్రాస్తాను ? బ్లాగ్ లో ఏదో ఒకటి వ్రాస్తాను . అలా వ్రాస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కథ వ్రాసేస్తాను అనుకుంటూ మళ్ళీ ఆగిన దగ్గరనుండి . చదవడం మొదలెట్టి అప్పటికి ఒకగంట పది నిమిషాలు అయింది. కథలెందుకు రాస్తారు ? నాలుగో అధ్యాయంలోకి వచ్చాను . ఒక్క వాక్యం దగ్గర ఆగి పోయి మళ్ళీ చదివాను .
కనుక మనం ఏదైనా చెప్పాలనుకున్నామంటే ఆ చెప్పేది, చెప్పాలనుకునేది ఏదీ వృధా అయి ఉండకూడదు అన్న వాక్యం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వృధా అయినవి ఏమైనా వ్రాయడం అంటే... చెక్ చేసుకోవాలి మనం వ్రాసిన వాటిని వెనక్కి మళ్ళి ...మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అప్పుడు వృధా అయినది తొలగించి వేస్తాం. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అదే సెల్ఫ్ ఎడిటింగ్ అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారిపోయాను. ఉలిని శానం మీద సాది సాది ఉలిని పట్టుకోవడమేలాగో తెలిసినవాడు, కొయ్యని తొలిచినట్టు ఇలా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను కూడా !
తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ...
కథ వ్రాయడానికి ముందు ఏదో ఒక రచయిత కథని చూస్తూ మనమూ అదే కథని తెల్లకాగితం మీద వ్రాయాలి అది అనువాద కథైతే మరీ మంచిది అని చదివాను
అనువాద కథని ఎక్కడనుంచి తేవాలిప్పుడు ? విపుల లో ఏదో ఒక కథని ఉన్నపళంగా వ్రాసేయాలి . అయ్యో ! విపుల ఎక్కడిది ? మంచి ఐడియా తట్టింది .ఆన్ లైన్ పత్రిక ఉంది కదా అని . అలా ఆన్లైన్ పత్రిక తెరిచి ఓ కథని వ్రాస్తున్నప్పుడు ఈ అనువాద రచయిత వ్రాసిన ఈవాక్యాన్ని ఇలా కూడా వ్రాయవచ్చునే ,పర్యాయ పదం కూడా వాడవచ్చునే అనే ఆలోచన మనకి వస్తుందన్నమాట. ( అప్పటికప్పుడు ఇది నా అభ్యాసంలో నేర్చుకున్న విషయం )
అలా చదవడం ద్వారా కల్గిన ఒక్కో అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ ఆక్టోపస్ లాంటి స్నేహితులకి చిక్కకుండా .. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని ఆరు రోజులో ఆ పుస్తకాన్ని చదవడం పూర్తీ చేసాను . ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రయాణం అసలు సరిగ్గా సాగనే లేదు . 28 శీర్షికలున్న అ పుస్తకాన్ని ఒక్కో శీర్షిక చదువుతున్నప్పుడల్లా మధ్యలో ఆగి ఆలోచించడం అనివార్యమైంది.ఎంతమంది రచయితలని ఎన్ని కథలు పరిచయం చేసారు. ఒకోసారి చదువుతున్న ఆ పుస్తకం పక్కన పడేసి అందులో పరిచయం చేసిన కథల కోసం ఆన్ లైన్ లో అన్వేషించాను కూడా !
.
ఇలా ప్రతి అధ్యాయం చదువుతున్నప్పుడు నాకంటూ కల్గిన జ్ఞానోదయాలు, జ్ఞాపకం వచ్చిన విషయాలు, అరె ఈ విషయం భలే వ్రాసారు ఇంతగా మనసులని చదివినట్టు వ్రాయడం ఎలా సాధ్యమవుతుందో !మనం కూడా ఇలా వ్రాయడానికి తగినంత సాధన చేయాలి అనుకోవడం సాధారణం అయిపోయింది. ప్రతి శీర్షిక చదివేటప్పుడు నాకు కల్గిన ఆలోచనలు వ్రాయాలంటే అదొక పుస్తకం అయిపోతుంది కాబట్టి వాటిని దాచేసుకుని ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను .
ఈ పుస్తకం చదవడం వల్ల కల్గిన లాభాలు .
.
నేనూ కథలు వ్రాసే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ప్రతి శీర్షిక ఆసక్తిగానూ ఉంది, పాఠం లాగా కూడా ఉంది .ఇంతకు క్రితం కథలు వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు గురించి రెండు పుస్తకాలూ చదివాను, కొన్ని విషయాలు గ్రహించాను కానీ ఖదీర్ బాబు గారి "కథలు ఇలా కూడా రాస్తారు " అంటూ ఇంకో సరికొత్త పరిచయాన్ని ఇవ్వడం మాత్రం అద్భుతంగా ఉంది . ముఖ్యంగా ప్రతి అధ్యాయం చివర బోర్లా పడుకుని పుస్తకం చదువుకునే బొమ్మైతే చాలా నచ్చింది . పుస్తకం వ్రాయడం కన్నా పుట్ నోట్స్ అందించిన శ్రమ చాలా ఎక్కువని చెప్పారు. అది చాలా చాలా నిజం అనిపించింది. చాలామంది గురించి ఒక్క పుస్తకంలో తెలుసుకోవడం సులభంగా ఉంది.
అలాగే ప్రతి విభాగం చివరా చమక్ మనిపించే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం పట్టుకుని ఆలోచిస్తే చాలు ఎంతో విషయం అవగతమవుతుంది. అలాంటి వాక్యాలని ఒక్కో కొలికి పట్టుకుంటూ వెళితే ఒక గొలుసు అవుతుంది. అదే ఈ పుస్తకం అవుతుంది. అది చదవటం ద్వారా వచ్చిన అవగాహన, జ్ఞానం అవుతుంది అని నేను చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని చదివిన ఇంకొకరి అనుభంతో నా అనుభవాన్ని సరి పోల్చుకున్నాను.
ఈ పుస్తకం రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది.నాలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదివి ఎంత ఉపయుక్తంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం కూడా అవసరం . అది ఇచ్చే సంతృప్తి రచయితకి బలం.
ఇంతకు ముందు కథలు వ్రాయడం అలవాటు లేనివాళ్ళు హటాత్తుగా కీ బోర్డ్ ముందు కూర్చోవడం ఆశ్చర్యం కాదు.
నాలా ఎలాగోలా కథలు వ్రాస్తున్నవాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ కథలు వ్రాస్తారు . అది సాహిత్యలోకానికి చాలా మంచిది కదా !
ఇప్పటికే బాగా కథలు వ్రాసి ప్రసిద్ది చెందినవాళ్ళు ఇందులో అంశాలన్నీ భలే ఉన్నాయి . ఇవి మనకి ఒకప్పటి అనుభవమే కదా, అప్పుడు అలా జరిగింది, అలా వ్రాసాను ,తర్వాత సరిచేసుకున్నాం అని అనుకుంటారు కూడా .
ఔత్సాహిక రచయితలకి,కొత్తగా పుస్తకం విడుదల చేయాలి అనుకునేవాళ్ళకి ఎన్నో సలహాలు,సూచనలు ఉన్నాయి. వెరసీ ఇది వ్రాసే వాళ్ళకందరికీ ఓ గైడెన్స్ లాంటిది.
నా కథల ప్రయాణంలో మంచి కథలేమైనా వ్రాయగల్గితే "కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన అనుభవం తప్పకుండా ఉంటుంది .
ఇంత మంచి పొత్తం అందిందించిన మహ్మద్ ఖదీర్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు,ధన్యవాదాలు తెలుపుతూ ...

Sunday, 8 May 2016

ఆన్ బర్త్ డే ప్రెజెంట్

ఆన్ బర్త్ డే ప్రెజెంట్

ఇవే మేలు 
బోలెడు వస్తాయి 
రీ పే చేయక్కర్లేదు 
పుట్టినాక ఎన్నో సాదించాము 
కాని దాటిన ఆపద లు 
అన్ని తల్లి పేగు ఆశీస్సులే 
ఆ దీవెన కంటే ఆత్మీయం అయిన గిఫ్ట్ ఏముందని !

ఈ ఏడాది వేసిన అడుగులు ముందుకు వెళ్ళే స్ఫూర్తిని ఇస్తూ 
శతమానం భవతి 







Monday, 4 April 2016

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం కధల పుస్తకం మీద

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం 
కధల పుస్తకం మీద 

ఖదీర్ బాబు రాసిన కొత్తపుస్తకం "కథలు ఇలా కూడా రాస్తారు" చదివాక 
ఇన్నికథలు ఇంతసాహిత్యం నేను చదవలేదే అని సిగ్గుపడలేదు గాని;
 ఇన్నికథలూ ఇంతసాహిత్యం ఖదీర్ బాబు చదివాడా అని అసూయపడ్డాను అన్నది నిజం!
ఈపుస్తకం రాయడం వెనక అతడి పరిశీలన, పరిశోధనలకన్నా
 "కథల గురించి తనకు తెలిసిన విషయాలను
 ఇతరులతో పంచుకోవాలనే తపనకి
 " ఒక డాక్టరేట్ ఇవ్వొచ్చు! ఎవరైనా యూనివర్సిటీవాళ్లు ఇచ్చినా అది నావరకు సంతోషమే.
ఈపుస్తకం ద్వారా ఖదీర్ బాబు ఔత్సాహిక రచయితలకు ఒక సిలబస్ సిద్ధం చేశాడని చెప్పొచ్చు!
 అలాగే కథ రాయాలనుకోగానే, ఒక ఆలోచన తట్టగానే తెల్లరేసరికల్లా కథరాసి పోస్టు చేసే వారికి
 "కథ రాయడం" ఇంత సీరియస్ విషయమా 
అని కళ్లు తెరిపించే అనేకవిషయాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
నావరకు నేను ఎన్నడూ చదవని, చదివే అవకాశం కూడారాని
 అనేకానేక ఉత్తమ కథల పరిచయాలు చదివే గొప్ప అవకాశాన్ని నాకు ఈపుస్తకం కల్పించింది. 
అన్ని చాప్టర్లలో కలిపి ఇలాంటి కథలు 100 పైగానే ఉన్నాయి.
"మంచి ప్రారంభాలూ... గొప్ప ముగింపులూ..." 
అనే చాప్టర్ కూడా అనేక ప్రారంభాలూ, 
ముగింపుల ఉదాహరణలతో ప్రతికథా రచయితకీ ఉపయోగపడేలా ఉన్నాయి.
ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదవొద్దని చెప్పినా...
 ఏక బిగిన చదివించేలా రాసినప్పుడు చదవకుండా ఉండడం ఎలాగో రచయిత చెప్పాలి కదా! smile emoticon 
ఒక పుస్తకాన్ని రాయడానికి రచయిత తీసుకున్న రిస్క్ లో ఒక్క శాతాన్ని పాఠకుడు
 తీసుకోలేక పోతాడా! అలాగని ఏక బిగిన చదవడం కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు! 
రెండో మూడో నాలుగో అయిదో కథలు రాసిన ఔత్సాహిక రచయితలు ప్రతి మూడునెల్లకీ 
డాక్టర్లు ఆల్బెండాజోల్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తిరగేస్తుండడం బెటర్. 
అప్పుడు పట్టుచీర కట్టిన భార్యని మళ్లిఒకసారి చూసినట్టు కొత్త ఉత్సాహం మొగ్గ తొడుగుతుంది!
అయితే ఫేస్ బుక్కులో సాహిత్య చర్చలుచేసేవాల్లపై
 ఖదీర్ బాబు అంతగా సదభిప్రాయాన్ని ప్రకటించలేదు ఈపుస్తకంలో! 
ఈ అభిప్రాయానికి కారణం అతడు ఫేస్ బుక్ కి దూరంగా ఉండడం వల్ల కావచ్చు
 లేదా అతడి పరిశోధనాత్మక భాద్యతలకి చర్చలు కామెంట్లు చికాకులు అనిపించి ఉండవచ్చు.
 ఇక్కడి కథా గ్రూపులో సవివరమైన చర్చలు చాలా జరిగాయని నా అభిప్రాయం.
 పత్రికల్లో చర్చలకి సలహాలకీ తావులేని వాతావరణంలో రచయితలు
 అనేకమంది తక్షణ అభిప్రాయాలకు మెసేజ్ బాక్సులు,
 కామెంట్ బాక్సులు వెతకడం వెనక ఎంతో ఇంటరాక్షన్
, ఆశ వుండడం నిజమని నా అభిప్రాయం. ఈ విషయంలో ఖదీర్ బాబు అభిప్రాయం
 వ్యక్తిగతమైనదిగా తీసుకోవచ్చు.
బహుశా ఒకపాట...
"నను నీ చెంతకు రప్పించే / గుణమే నీలో ఉన్నదనీ" లాగా 
ఫేస్ బుక్ లాగేస్తుందనే భయము ఉన్నట్టుంది!
తెలుగులో కథా సాహిత్యం విరబూయించ దలచిన వాల్లని ఆహ్వానిస్తూ 
తనదైన ఒక పుష్ప గుచ్ఛంతో ఆహ్వానించాడు! కథ పట్ల, కథా రచన పట్ల, 
మంచి కథా రచయితల పట్లా ఖదీర్ బాబు అభిమానాన్ని కౌగిలించుకోవాల్సిందే! 

Saturday, 2 April 2016

Monday, 28 March 2016

కధలు , ఖదీరుడి కబుర్లు

కధలు , ఖదీరుడి కబుర్లు 
కవిత పురుడు పోసుకొనేదాక 
అక్షరాల నొప్పులు తప్పవు 
అంటాడు ఒక కవి 

మరి కధకు అవేమి ఉండవా ! 
ఏమో మపాసా నో ,రావి శాస్త్రి నో 
చాసో నో ఎవరినో ఒకరిని అడగాలి . 
పాపం వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటె ... 
అయినా అడిగేవాళ్ళు ఎక్కడ ఉన్నారు 
లోపల వ్రాయాలి అనే తపన వెలిగే వాళ్ళు తప్ప 

కధా కష్టాలు అడుగులు వేసే కలాలకే 
అనుకుంటాము 
కాని పరుగులు తీస్తూ 
పదునెక్కిన కలాలకు కూడానా ! 
ఇవన్నీ తెలుసుకోవాలంటే 
''కధల పుస్తకం '' చదవండి 
ఖదీర్ బాబు కధల కబుర్లు ఆయన మాటల్లోనే 
చదవండి . పుస్తకాలు అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాల్లో లభ్యం 





Tuesday, 22 March 2016

కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని 2

కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని 2
మానస ఎండ్లూరి అభిప్రాయం



సభలో నా మాటలు చదివినందుకు Kuppili Padma గారికి ధన్యవాదాలు smile emoticon
నాకు అన్నీ అందించిన Hemalatha Putla Sudhakar Yendluri గార్లకు కూడా... grin emoticon
Mohammed Khadeerbabu గారి కొత్త పుస్తకం 'కథలు ఇలా కూడా రాస్తారు' చదివాక...
ఎందుకు చదవాలి?
శిక్షణ ఇవ్వలేదు. పెళ్లి చేశారు.
శిక్షణ తీస్కోలేదు. కథలు రాశాను.
నేర్పిస్తే వచ్చేవా ఇవి? అలాగే తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాను.
రెండేళ్లవుతోంది. అందరినీ చూస్తున్నాను. అంతో ఇంతో దారిలో పడే ప్రయత్నమో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నమో చేస్తున్నాను. అందరివీ చదువుతున్నాను. ఏదో అర్ధమయ్యి కానట్టు ఉంది.
ఉన్నట్టుండి బామ్మ దిగింది. సంసార పాఠాలు మొదలుపెట్టిoది. ఇంకెవరైనా వచ్చి నా పాళికి పదును పెడితే బాగుణ్ను. ప్చ్.
పది కథలు రాసినప్పటికీ కలం పట్టుకోడానికి జంకుతున్నప్పుడు తలుపు చప్పుడైంది. కొరియర్ అబ్బాయిని మొదటి సారి ఓ రక్షకుడిగా చూశాను. వజ్రాయుధాన్ని నా చేతిలో పెట్టి వెళ్ళాడు. ‘కథలు ఇలా కూడా రాస్తారు’
నేను ఎవర్నీ? అనే ఆథ్యాత్మిక ప్రశ్నకు నేను వ్యతిరేకిని. ఎన్ని అవతారాలెత్తినా చివరికి ఊపిరి పీల్చుకునే తోలు తిత్తినే. నేను ఎందుకు కథలు రాస్తున్నాను అనే ప్రశ్న మాత్రం బాగా వెంటాడుతోంది. కారణం నాకు తెలుసు. కానీ ఇంకా స్పష్టత లేదు. దాన్లోంచి పుట్టుకొచ్చే మరిన్ని సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెంటనే యాభై ఎనిమిది పేజీలు చదివేశాను. పుస్తకం మూసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను. చప్పున కళ్ళు తెరవలేదు. తెరవడానికి నేను చదివినవి యాభై ఎనిమిది పేజీలైతే కదా! కాదు. కనీసం యాభై పుస్తకాలు. జ్ఞానం సంగతి తరువాత చూద్దాం. కళ్ళకు ఎంత పని తప్పించాడు. పుస్తకాల వేటలో కాళ్ళకి ఎంత శ్రమ మిగిల్చాడు. నా కోసం రెండడుగులేసి పక్క గదిలో ఉన్న మక్సీం గోర్కి ‘అమ్మ’ను తీసుకురాలేదే మా చెల్లి. మరి ఇతనెందుకు ఇంత ఉపకారం చేస్తున్నాడు? నేను లేచి పుస్తకం తెచ్చుకోలేనని ఈయనకెలా తెలిసింది? నేను లెగలేకపోతున్నందుకు ఆయన ఈ పుస్తకం రాయకపోయనా నాకు మాత్రం అలాగే అనిపించింది. రేపు ఒక మంచి పుస్తకం పూర్తి చేయబోతున్నానన్న నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోయాను.
ముందుగా ఆయనకు నమస్కారాలు. ఎందుకంటే పుస్తకంలో ఎక్కడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి చిన్నప్పుడు వదిలేసిన సైన్స్ పుస్తకాన్ని తలపించనందుకు.
ఇందులో ఉన్నవి మనకు తెలిసినవే. అన్నీ కాదు. కొన్ని. ఆ కొన్ని కూడా మరింత విపులంగా తెలుసుకోవాలన్నప్పుడు చేయాల్సిన పని వెంటనే ఈ శ్వేత కితాబును తెరవడం.
ఇందులోని ప్రతి అంశం గుర్తుపెట్టుకో తగ్గది. ఎన్ని గుర్తుపెట్టుకుంటామో ఏమో గానీ ప్రతి అక్షరం చదివించగలగడం ఓ అద్భుతమే. ఎందుకంటే ఇది ఫిక్షన్ కాదు కాబట్టి. కానీ మనల్ని ఓ ఆసక్తికరమైన కథ చదివించినట్టే ఉంటుంది. స్కూల్లో పెద్ద పెద్ద జవాబులను మొదలూ చివరా చదివి మధ్య భాగాన్ని పరిక్షా సమయాల్లో మన ఊహకు అప్పజెప్పి ఉంటామేమో గానీ ఇందులో ఒక్క ముక్క కూడా వదలం. అది కచ్చితం.
ఏదోక వ్యాసమో కథో నవలో అదో ఇదో చదవడం మొదలు పెట్టాక రెండో లైను దగ్గరే నచ్చకపోయినా విసుగొచ్చినా, కష్టపడి అంతా చదివి ఇంకో రెండు ముక్కలు చదివితే కథ పూర్తవుతుందనగా ముగింపు అవాస్తవంగా అనిపించ వచ్చన్న సందేహం కలిగినా పక్కన పడేసే నాలాంటి సుంకరి చేత ఒక్క అక్షరం కూడా వదలకుండా చదివించాడు.
పుస్తకం మొదలు పెట్టేటప్పుడు మామూలు మనిషిలా మాట్లాడుతూ మనకు తెలియకుండానే ఓ గురువులా మారిపోతాడు. చివరికి వచ్చేసరికి మనింట్లో పెద్దన్నలా ఓ తండ్రిలా జాగ్రత్తలు చెబుతూ మనల్ని నడి రోడ్డులో వదిలేసి నిష్క్రమిస్తాడు. వేలు పట్టి చివరి దాకా నడిపించడు. నడవడం ఎలాగో చెప్తాడు. అంతే. కాళ్ళు ఉన్నాయి నడవడం తెలిసింది. ఇక అడుగులేయడమే మన కర్మం.
వళ్ళో కూర్చోబెట్టుకుని అఆ లు దిద్దిస్తున్నట్టే ఉంటుంది. నోరు పెద్దగా తెరిచి శబ్దాలు నేర్పిస్తున్నట్టే ఉంటుంది. కానీ భాష నేర్చుకోవాల్సింది మనమే.
పేజీలు తిప్పేకోద్దీ మనల్ని మఠం వేయించి కూర్చోబెడతాడు. మధ్య మధ్యలో మొట్టికాయలు పడుతుంటాయి. చెవులు మెలిపడుతుంటాయి. తొడ పాసాలు తేలుతుంటాయి. బెత్తం కనబడకుండానే క్రమశిక్షణ అలవడుతుంటుంది.
కొన్ని అంకాలు హటాత్తుగా ముగుస్తాయి. కొన్ని ఫక్కున వచ్చే మన నవ్వుతో ముగుస్తాయి.
ఎంతోమంది కథకుల జీవితాలలోని ఉదంతాలు చెబుతాడు. అనేక జీవితాలు చూపిస్తాడు. కథకులుగా మనల్ని భయపెట్టే అద్భుతమైన కథలను మనకు పరిచయం చేస్తాడు. అయితే కథకుల లక్షణాలు చదవగానే కాస్త ధైర్యం వచ్చింది. నిజానికి చదివినప్పుడు కాదు. చదివి నాక్కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు.
చుక్కల పిచ్చి తగదు అని చదివినప్పుడు టక్కున గుర్తొచ్చింది. ఎనిమిదో తరగతిలో ప్రతి వాక్యాన్నీ చుక్కలతో నింపిచ్చిన ప్రేమలేఖను చూసి వాడ్ని ఎందుకు రెండు పీకానో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్ధమైంది.
తన పుస్తకంలో తన పుస్తకమేంటి? ఇక అది మా పుస్తకం. గొప్ప గొప్ప ఉదాహరణల వానలో మనల్ని తడిపి ముద్ద చేస్తాడు. మనకు తెలియకుండానే నల్లమందు ఎక్కిస్తాడు. కాని అది పుస్తకం పూర్తయ్యాక పని చేయడం మొదలు పెడుతుంది. ఇక గిలా గిలా గింజుకోడమే మన పని.
పుట్టిన రోజు నుంచి చచ్చే రోజు వరకు ఆ తరువాత కూడా ఏం జరుగుతుందో చెప్పేశాడు. కాకపోతే కథ రాయడం దానికి రివర్స్ లో జరుగుతుంది కదా. ఒక్కోసారి ఆలోచనలు రాక మరణిస్తుంటాం. ఆ క్రమంలో మరణించిన ఆలోచనలను దాటుకుంటూ సజీవమైన ఇతివృత్తాలు వృత్తాంతాలు కథనాలతో కథ పుడుతుందని తెలియజెప్తాడు.
కథ గురించి ఇన్ని విషయాలున్న ఈ పుస్తకంలో కథంటే ఏమిటి? అనే శీర్షిక లేకుండానే అదేంటో మనకు వివరిస్తాడు. చివరికి కథలు ఎందుకు రాయాలి అన్న ప్రశ్నకి ఆయన రాసిన సమాధానం మనం చదివి తీరాల్సిందే.
ఖదీర్ ని కలిస్తే ఆయనతో ఫోటో దిగకపోయినా పర్వాలేదు. బయట ఆయన్ని చూసి నవ్వకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయినా ఏం కాదు. కానీ ఆయనతో కలిసి ఈ కథా వాహనంలో ప్రయాణించక పోతేనే మిస్ అవుతాం. ఏం మిస్ అవుతామో తెలియాలంటే ఈ పుస్తకం చదవితేగా తెలిసేది!
ఏడాది పాటు రోజూ సాయంకాలం ఆయనతో కూర్చున్నా ఈ పుస్తకంలో ఉన్న అన్నీ విషయాలు ఆయన చెప్పలేరేమో.
సాధారణంగా చాలా మంది పుస్తకాలను బహూకరిస్తుంటారు. అయితే ఈ పుస్తకం బహుకరించడంలో చిన్న సమస్య ఉంది. పాఠకులకు ఇస్తే వాళ్ళు ఒక మంచి కథకు ఉండాల్సిన లక్షణాలను తెలుసుకుని మన కథలకు మనమే ఎసరు పెట్టుకున్నంత పనవుతుంది. ఆ స్థాయిలో కథలు రాయాలి మరి. అదే మూస కథల్లో పట్టభద్రులైన పెద్దవారికిస్తే వారి కథలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెప్పినట్టు. కొత్త రచయితలకు ఇస్తే పండగే.
ఈ పుస్తకం చదివాక ముందు ముందు గొప్ప కథలు రాస్తానో లేదో తెలీదు గానీ రావి శాస్త్రి రచ.ఇ.త లో వితంతువుకు పట్టిన గతి ఎవరికీ పట్టనివ్వకపోతే అదే పదివేలు.
ఇంతకీ ఈయన ఇంత కృషి దేనికి చేసినట్టు? నా కోసం. నీ కోసం. అందరి కోసం. ఇంతటి విలువైన సమాచారాన్ని, అనుభవాలని, మార్గదర్శిని మాకు అందజేసినందుకు ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
ఈ పుస్తకం ఎందుకు చదవాలంటే...
కథకుడి(రాలి)గా చావును దూరం చేసుకోడానికి.
పాఠకులను మన కథలకి దగ్గర చేయడానికి.
ఒక చెత్త కథ చదివి సంపూర్ణంగా ద్వేషించడానికి.
కథా సాహిత్యంలో కలకాలం నిలబడడానికి. మనం కాదు. మన రచనలు.
కథకులకు ఉండాల్సిన నిబద్ధతను తెలుసుకోడానికి.
ముఖ్యంగా కథను గౌరవించడానికి.
-మానస ఎండ్లూరి

Friday, 18 March 2016

కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని


కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని
అమ్మ చేసిన కూర బాగుంటుంది 
కొంచెం తాలింపు వాసన ముందుగా 
ముక్కును పలకరిస్తే ఇంకా బాగుంటుంది .... 
ఆకలి ఇంకొంచెం ఎక్కువ అయ్యేలా .... 

ఈ కధల బుక్ కబుర్లు కూడా అన్వర్ గారి 
 నుండి ,చదవండి . 
రేపే ఆవిష్కరణ తప్పకుండా వెళ్ళండి . 





From Artist Anwar wall:
విశ్వాసాలు బద్దలవుతాయని నాకెవరూ చెప్పకపొవడం,
చెప్పినా వినకపొవడం పై నాకిప్పుడు నా పై నాకే కోపం వస్తున్నది.
ఇదిగో వీడు ఇంతెత్తు మనిషి, ఇంత బరువు మనిషి, 
ఇంత పొగరు మనిషి అని మాత్రమే విశ్వాసం కలిగిన నా కళ్ళకు , 
ఖదీరు తాలూకూ వాటన్నిటి వెనుక, ఆ పై ఇతగాడి వాక్యం వెనుక, 
వీడి అక్షర పరుసవేది వెనుక "సాధన" అనే చక్కని,
విన సొంపైన మంత్రం వున్నదని తెలిసినపుడు,
విశ్వాసాలు బద్దలయినప్పట్టికీ నా మీద నాకెంత గౌరవం వుందో 
అంతే గౌరవాన్ని ఇతడిపై పెంచుకోవలసిన అవసరం ఏర్పరిచాడు ఖదీర్. 
చూడబోతే ఎంత తెలివిగా శత్రువులని మిత్రులుగా మలుచుకునేంత టక్కరివాడో కదా ఇతను!
పతంజలి ప్రభువు రాయని పాఠం వీడిది.
నాకు తెలిసింది, తెలియదు అనుకుని గట్టిగా నమ్మేది బొమ్మలు ఒకటే.
ఆ బొమ్మలని, ఆ హైరానాని తెలుసుకోవడానికి నాకు నచ్చిన బొమ్మ
 ప్రతి ఒక్కదాన్ని గట్టిగా చూస్తాను. అంతే గట్టిగా దాన్ని సాధన చేస్తాను. 
కాపీ చేస్తాను, సాధన చేసిన దాన్ని మళ్ళీ మళ్లీ చూడకుండా గీయ ప్రయత్నిస్తాను.
కుదరక పొయినపుడు నా గంటంతా పొయినట్టు గొంతు చించుకుని దుఖ పడతాను. 
ఒక్కోసారి సాధన కొద్ది వేస్తున్న బొమ్మ తల పైని చిరువెంట్రుక పై నుంచి కదిల్చిన
నా పెన్ను బొమ్మ గాడి కాలి మడమదాక ఒక ఊపులో కళ్ళు మూసుకుని మరీ ...
 నా అరవై అయిదు కిలోల బరువు దాని మోపి మరీ.... 
సర్రుమని గీత లాగ ప్రయత్నిస్తాను. ఇది బొమ్మల్లో శబ్దభేది.
వాడెవడో రోజుకు ఒక ఇంకు బాటిల్ మనిషటా! అని విని ,
వాడ్ని మించడానికి రోజుకు రెండు ఇంకు బాటళ్ళ మనిషిని నేనని
నిరూపించ సాధన చేస్తూ వుంటాను. కలలో మెలకువలో ఒకటే సాధన.
ఇటువంటి పనిని ఇంతే నిబద్దతతో ,
 ఇష్టంతో, ప్రేమతో ఇదే జీవితమనుకుని చేసేవాడు
తెలుగు రచయితల్లో ఒకడున్నాడని ఈ పుస్తకం నాకు తెలిపింది 
అలా తెలుసుకోవడం అంటే మనల్ని మనం మరో రూపంలో కనుక్కోవడమే.
ఈ పుస్తకం ప్రొడ్యూస్ చేసిన ఖదీర్ ని గౌరవించడమంటే శ్రమ శక్తిని, 
సాధన స్పూర్తిని గౌరవించడం అని నామట్టుకు నేను భావిస్తున్నాను 
అయ్యా ! ఖదీర్, నువ్వు నీ వల్ల, నీ పొగరు వల్ల మనుషుల్ని దూరంగా వుంచి
నీ పనివల్ల అదే మనుషుల్ని నీ ప్రేమలోకి లాగినావు.
 ఇంతకు మించి నరరూప రచయిత అనేవాడు ఎం చెయ్యగలడబ్బా?
ఒక్కోసారి కొండ దగ్గరికి మహమ్మద్ రావలసి వుంటుంది తప్పదు.
దేవుడు అలా డిసైడ్ చేసి పెట్టాడు మరి.
ఇవాళ ఖదీర్ నా దగ్గరికి వచ్చి పుస్తకం ఇలా పెట్టిపోయాడంటే 
మహమ్మదు అలా డిసైడ్ చేశాడనే. — with Mohammed Khadeerbabu.

Monday, 7 March 2016

రాబోతున్న కొత్త పుస్తకం

రాబోతున్న కొత్త పుస్తకం 
అలాంటి కధలు 
ఇలాంటి కధలు అనుకుంటున్నారా !
కానే కాదు 
ఇది కధ లకే జన్మ నివ్వబోయే అమ్మ 
ఎందరో కధకులను సృష్టించ బోయే బ్రహ్మ 
ఎలా ఉంటుంది అంటారా ..... 
చూడండి 
ఖదీర్ బాబు గారి రెండేళ్ళ కృషి 
ఎదిగిన చెట్టు ఎన్నో కొత్త మొక్కలకు 
పాదులు సరిచేయపోతోంది .... 
ఫలాలు ఎలా వస్తాయో వేచి చూడాల్సిందే !


మరి దీనిలో ఏముంటాయో అంటే 
బోలెడు విషయాలు 
కొత్త కధకులకు కధా రచనలో వచ్చే 
సందేహాలు అన్నీ ... 
ఒక వంద సార్లు రీ ప్రింట్ అవ్వాలి అని 
కోరుకుందాము . ఒక్క తెలుగు వాడి 
గురించి అయినా ప్రపంచం తెలుసుకుంటుంది 
అల్ ది బెస్ట్ ఖదీర్ గారు 





Thursday, 25 February 2016

ఇంకొన్ని జ్ఞాపకాలు

ఇంకొన్ని జ్ఞాపకాలు
మాడభూషి రంగాచార్య కధా పురస్కారం 2015
బియాండ్ కాఫీ కదా సంకలనానికి
ఈ రోజు అందుకున్న ఖదీర్ గారికి అభినందనలు










Thursday, 11 February 2016

పాటల హేల ఘంటసాల


పాటల హేల ఘంటసాల ఆపాత మధురాలు 
ఖదీర్ గారి కలం నుండి ..... 
పాటలు మధురం గానం మధురం 
వర్ణించిన అక్షరాలు దాగిన భావం 
మధురాతి మధురం 






khadeer gari interview by ananth link

అజో విభో అవార్డ్ విశేషాలు



Tuesday, 2 February 2016

కొత్త ఏడాది కురిసే అవార్డుల వర్షం


కొత్త ఏడాది కురిసే అవార్డుల వర్షం

హంద్రి నీవా అవార్డు ఒక చినుకు
మాడభూషి అవార్డు ఇంకో చినుకు
ఈ ఏడాది ఇంకా చినుకులు కురిసి
ఆనందం మీకు వెల్లి విరియాలి
అభినందనలు



Wednesday, 13 January 2016

కొత్త ఏడాది ఒక్క అవార్డు తో

కొత్త ఏడాది ఒక్క అవార్డు తో 

అజో విబొ అవార్డ్ అందుకుంటూ