స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday, 4 April 2016

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం కధల పుస్తకం మీద

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం 
కధల పుస్తకం మీద 

ఖదీర్ బాబు రాసిన కొత్తపుస్తకం "కథలు ఇలా కూడా రాస్తారు" చదివాక 
ఇన్నికథలు ఇంతసాహిత్యం నేను చదవలేదే అని సిగ్గుపడలేదు గాని;
 ఇన్నికథలూ ఇంతసాహిత్యం ఖదీర్ బాబు చదివాడా అని అసూయపడ్డాను అన్నది నిజం!
ఈపుస్తకం రాయడం వెనక అతడి పరిశీలన, పరిశోధనలకన్నా
 "కథల గురించి తనకు తెలిసిన విషయాలను
 ఇతరులతో పంచుకోవాలనే తపనకి
 " ఒక డాక్టరేట్ ఇవ్వొచ్చు! ఎవరైనా యూనివర్సిటీవాళ్లు ఇచ్చినా అది నావరకు సంతోషమే.
ఈపుస్తకం ద్వారా ఖదీర్ బాబు ఔత్సాహిక రచయితలకు ఒక సిలబస్ సిద్ధం చేశాడని చెప్పొచ్చు!
 అలాగే కథ రాయాలనుకోగానే, ఒక ఆలోచన తట్టగానే తెల్లరేసరికల్లా కథరాసి పోస్టు చేసే వారికి
 "కథ రాయడం" ఇంత సీరియస్ విషయమా 
అని కళ్లు తెరిపించే అనేకవిషయాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
నావరకు నేను ఎన్నడూ చదవని, చదివే అవకాశం కూడారాని
 అనేకానేక ఉత్తమ కథల పరిచయాలు చదివే గొప్ప అవకాశాన్ని నాకు ఈపుస్తకం కల్పించింది. 
అన్ని చాప్టర్లలో కలిపి ఇలాంటి కథలు 100 పైగానే ఉన్నాయి.
"మంచి ప్రారంభాలూ... గొప్ప ముగింపులూ..." 
అనే చాప్టర్ కూడా అనేక ప్రారంభాలూ, 
ముగింపుల ఉదాహరణలతో ప్రతికథా రచయితకీ ఉపయోగపడేలా ఉన్నాయి.
ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదవొద్దని చెప్పినా...
 ఏక బిగిన చదివించేలా రాసినప్పుడు చదవకుండా ఉండడం ఎలాగో రచయిత చెప్పాలి కదా! smile emoticon 
ఒక పుస్తకాన్ని రాయడానికి రచయిత తీసుకున్న రిస్క్ లో ఒక్క శాతాన్ని పాఠకుడు
 తీసుకోలేక పోతాడా! అలాగని ఏక బిగిన చదవడం కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు! 
రెండో మూడో నాలుగో అయిదో కథలు రాసిన ఔత్సాహిక రచయితలు ప్రతి మూడునెల్లకీ 
డాక్టర్లు ఆల్బెండాజోల్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తిరగేస్తుండడం బెటర్. 
అప్పుడు పట్టుచీర కట్టిన భార్యని మళ్లిఒకసారి చూసినట్టు కొత్త ఉత్సాహం మొగ్గ తొడుగుతుంది!
అయితే ఫేస్ బుక్కులో సాహిత్య చర్చలుచేసేవాల్లపై
 ఖదీర్ బాబు అంతగా సదభిప్రాయాన్ని ప్రకటించలేదు ఈపుస్తకంలో! 
ఈ అభిప్రాయానికి కారణం అతడు ఫేస్ బుక్ కి దూరంగా ఉండడం వల్ల కావచ్చు
 లేదా అతడి పరిశోధనాత్మక భాద్యతలకి చర్చలు కామెంట్లు చికాకులు అనిపించి ఉండవచ్చు.
 ఇక్కడి కథా గ్రూపులో సవివరమైన చర్చలు చాలా జరిగాయని నా అభిప్రాయం.
 పత్రికల్లో చర్చలకి సలహాలకీ తావులేని వాతావరణంలో రచయితలు
 అనేకమంది తక్షణ అభిప్రాయాలకు మెసేజ్ బాక్సులు,
 కామెంట్ బాక్సులు వెతకడం వెనక ఎంతో ఇంటరాక్షన్
, ఆశ వుండడం నిజమని నా అభిప్రాయం. ఈ విషయంలో ఖదీర్ బాబు అభిప్రాయం
 వ్యక్తిగతమైనదిగా తీసుకోవచ్చు.
బహుశా ఒకపాట...
"నను నీ చెంతకు రప్పించే / గుణమే నీలో ఉన్నదనీ" లాగా 
ఫేస్ బుక్ లాగేస్తుందనే భయము ఉన్నట్టుంది!
తెలుగులో కథా సాహిత్యం విరబూయించ దలచిన వాల్లని ఆహ్వానిస్తూ 
తనదైన ఒక పుష్ప గుచ్ఛంతో ఆహ్వానించాడు! కథ పట్ల, కథా రచన పట్ల, 
మంచి కథా రచయితల పట్లా ఖదీర్ బాబు అభిమానాన్ని కౌగిలించుకోవాల్సిందే! 

No comments:

Post a Comment