స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Friday, 18 March 2016

కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని


కధల పుస్తకం కబుర్లు ఇంకొన్ని
అమ్మ చేసిన కూర బాగుంటుంది 
కొంచెం తాలింపు వాసన ముందుగా 
ముక్కును పలకరిస్తే ఇంకా బాగుంటుంది .... 
ఆకలి ఇంకొంచెం ఎక్కువ అయ్యేలా .... 

ఈ కధల బుక్ కబుర్లు కూడా అన్వర్ గారి 
 నుండి ,చదవండి . 
రేపే ఆవిష్కరణ తప్పకుండా వెళ్ళండి . 





From Artist Anwar wall:
విశ్వాసాలు బద్దలవుతాయని నాకెవరూ చెప్పకపొవడం,
చెప్పినా వినకపొవడం పై నాకిప్పుడు నా పై నాకే కోపం వస్తున్నది.
ఇదిగో వీడు ఇంతెత్తు మనిషి, ఇంత బరువు మనిషి, 
ఇంత పొగరు మనిషి అని మాత్రమే విశ్వాసం కలిగిన నా కళ్ళకు , 
ఖదీరు తాలూకూ వాటన్నిటి వెనుక, ఆ పై ఇతగాడి వాక్యం వెనుక, 
వీడి అక్షర పరుసవేది వెనుక "సాధన" అనే చక్కని,
విన సొంపైన మంత్రం వున్నదని తెలిసినపుడు,
విశ్వాసాలు బద్దలయినప్పట్టికీ నా మీద నాకెంత గౌరవం వుందో 
అంతే గౌరవాన్ని ఇతడిపై పెంచుకోవలసిన అవసరం ఏర్పరిచాడు ఖదీర్. 
చూడబోతే ఎంత తెలివిగా శత్రువులని మిత్రులుగా మలుచుకునేంత టక్కరివాడో కదా ఇతను!
పతంజలి ప్రభువు రాయని పాఠం వీడిది.
నాకు తెలిసింది, తెలియదు అనుకుని గట్టిగా నమ్మేది బొమ్మలు ఒకటే.
ఆ బొమ్మలని, ఆ హైరానాని తెలుసుకోవడానికి నాకు నచ్చిన బొమ్మ
 ప్రతి ఒక్కదాన్ని గట్టిగా చూస్తాను. అంతే గట్టిగా దాన్ని సాధన చేస్తాను. 
కాపీ చేస్తాను, సాధన చేసిన దాన్ని మళ్ళీ మళ్లీ చూడకుండా గీయ ప్రయత్నిస్తాను.
కుదరక పొయినపుడు నా గంటంతా పొయినట్టు గొంతు చించుకుని దుఖ పడతాను. 
ఒక్కోసారి సాధన కొద్ది వేస్తున్న బొమ్మ తల పైని చిరువెంట్రుక పై నుంచి కదిల్చిన
నా పెన్ను బొమ్మ గాడి కాలి మడమదాక ఒక ఊపులో కళ్ళు మూసుకుని మరీ ...
 నా అరవై అయిదు కిలోల బరువు దాని మోపి మరీ.... 
సర్రుమని గీత లాగ ప్రయత్నిస్తాను. ఇది బొమ్మల్లో శబ్దభేది.
వాడెవడో రోజుకు ఒక ఇంకు బాటిల్ మనిషటా! అని విని ,
వాడ్ని మించడానికి రోజుకు రెండు ఇంకు బాటళ్ళ మనిషిని నేనని
నిరూపించ సాధన చేస్తూ వుంటాను. కలలో మెలకువలో ఒకటే సాధన.
ఇటువంటి పనిని ఇంతే నిబద్దతతో ,
 ఇష్టంతో, ప్రేమతో ఇదే జీవితమనుకుని చేసేవాడు
తెలుగు రచయితల్లో ఒకడున్నాడని ఈ పుస్తకం నాకు తెలిపింది 
అలా తెలుసుకోవడం అంటే మనల్ని మనం మరో రూపంలో కనుక్కోవడమే.
ఈ పుస్తకం ప్రొడ్యూస్ చేసిన ఖదీర్ ని గౌరవించడమంటే శ్రమ శక్తిని, 
సాధన స్పూర్తిని గౌరవించడం అని నామట్టుకు నేను భావిస్తున్నాను 
అయ్యా ! ఖదీర్, నువ్వు నీ వల్ల, నీ పొగరు వల్ల మనుషుల్ని దూరంగా వుంచి
నీ పనివల్ల అదే మనుషుల్ని నీ ప్రేమలోకి లాగినావు.
 ఇంతకు మించి నరరూప రచయిత అనేవాడు ఎం చెయ్యగలడబ్బా?
ఒక్కోసారి కొండ దగ్గరికి మహమ్మద్ రావలసి వుంటుంది తప్పదు.
దేవుడు అలా డిసైడ్ చేసి పెట్టాడు మరి.
ఇవాళ ఖదీర్ నా దగ్గరికి వచ్చి పుస్తకం ఇలా పెట్టిపోయాడంటే 
మహమ్మదు అలా డిసైడ్ చేశాడనే. — with Mohammed Khadeerbabu.

No comments:

Post a Comment