స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday 18 February 2013

''పతంజలి'' కి ఒక అంజలి

కధ అంటే హృదయం నుండి పొంగి బుగ్గ పై పడి చిట్లిన కన్నీటి చుక్క....
తన చిట్టి వేరు తో భూమిని నెట్టి నిలబడి కరుకుపడిన మట్టిని పెళ్లగించి బయటకు
వచ్చే చిన్ని విత్తనం.....
భాదితుల కేకలు ఎగరేసి ప్రపంచానికి చూపే జండా కర్ర....
రవి చూడని  బాధల్ని సైతం చూసి లోకానికి చూపే మౌన సాక్షి....
విప్లవాలను రగిలించే అగ్ని కణం.....
ఇవన్నీ కాక ఇదిగో ఇంకొక్క కధ ఉంది ఇక్కడ.....

ఎవరి ముక్కునైనా వేలెత్తి చూపి ప్రశ్నిస్తూ
''ఆడు మొగాడ్రా''అని శెబాష్ అనిపించుకొని రచయితల
తల గర్వంగా నిలిపిన కలం ....ఆ కలం పేరు ''పతంజలి''
పరిచయం అవసరం లేని కలం....ఖదీర్ గారి కలం నుండి
వ్రాలిన అక్షర సుమ మాల ....చదవండి.

(sameeksha link ikkada )


Thursday 14 February 2013

మధుబాల కు నివాళి

ఇన్ని గుండెల్లో కొలువుండే మహారాణికి
గుండె ఎందుకు అనుకున్నాడు ఏమో దేవుడు....
బురదలోనే పద్మం వికసిస్తుంది
దరిద్రం కూడా ఓడిపోతుంది ఈ అందం ముందు అనుకున్నాడు ఏమో....
నలుపు తెలుపుల్లో దాగి ఉన్న ఈ ముగ్ద మోహన సౌందర్యం వెనుక ఉన్న
విషాద నీలి నీడలు....ఖదీర్ బాబు కలం నుండి ....
ఆ సుకుమార సౌందర్యానికి ఇదే ఆయన నివాళి
(మధుబాల నివాళి లింక్ ఇక్కడ)