స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 12 December 2013

''బియాండ్ కాఫీ ''కధా సంకలనం రెండో ముద్రణ

తొలి ముద్రణ ప్రతి ఆవిష్కరణ జరిగినది ఆగస్టు ఐదు
 రెండువేల పదమూడున,
రెండవ ముద్రణ, డిసెంబరు రెండువేల పదమూడున జరిగింది . 



Tuesday 3 December 2013

పుస్తకాల పండుగ

పుస్తకాల పండుగ 
మిగిలిన పండుగలు అన్నీ ఎవరో కొందరు 
చేసుకుంటారు 
కానీ ఈ పండుగ జ్ఞానం వైపు అడుగులు వేసే 
ప్రతి ఒక్కరు చేసుకొనే పండుగ 
 డిసెంబర్ ఏడు  నుండి హైదరాబాద్ లో 
వెళ్ళండి. పుస్తకాలు కొనుక్కోండి .  
భావాల తర్జుమా బాషను సృష్టించి న తరువాత 
భాష లిపి లో ఒదిగిన తరువాత 
నాగరికత ఎంతగా ఎదిగిందో అందరికి తెలుసు . 

పదవులు ,పై పంచెలు కాదు మనిషికి 
గౌరవాన్ని ఇచ్చేవి 
పది మంది కోసం నిలబడే మనసు 
ఆదరిస్తూ పలికే నాలుగు మాటలు 
ఇవే మనిషి గౌరవాన్నిచ్చేవి ..... 
జ్ఞానాన్ని అక్షయమైన అక్షరాలుగా మార్చి 
తమలో దాచుకున్న మ్యూజియమ్స్ పుస్తకాలు . 
''పుస్తకం హస్త భూషణం ''అన్నారు 
''నీవు చదివిన పుస్తకాలు చెప్పు 
నీవేమిటో చెపుతాను ''అన్నారు . 
మీరేమిటో చెప్పే పుస్తకాలు తెచ్చుకోండి . 
మీ తరువాతి తరాలకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి . 
దీని గూర్చి ''సాక్షి సాహిత్యం '' 2/12/2013 లో