స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 31 December 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016

ఖదీర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016



ఖదీర్ బాబు గారితో చింతపల్లి అనంత్ గారి ఇంటర్వ్యు 
ఇవీ.)
దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు కథావరణంలో ఇంకా పుట్టని ఒక prodigal story teller కి 
అల్లా ఖర్రారు చేసిన పేరు మహమ్మద్ ఖదీర్ బాబు. 
ఇప్పుడు ఈ పేరు అసలు పరిచయమే అవసరం లేనంతగా చొచ్చుకువచ్చిన మెరుగైన, 
అపురూపమైన, మేలిమి, అరుదైన సంతకం. 
ఖదీర్ మా తరం తీర్చి దిద్దిన అందమైన, అర్థవంతమైన నిలువెత్తు సంతకం.
 ఇవాళ ఖదీర్ కు సన్మానం మా తరానికి సన్మానం. నా కన్నతల్లి కర్నూలులో,
నేను కన్న తొలి గంగాప్రవాహం హంద్రీ పేరిట ఖదీర్ కథలను ఇల్లా సన్మానించుకోవడం 
నాకు ప్రత్యేకించి సంతోషం. గర్వం. 
పరిచయ వాక్యాల పరిధిలో, పరిమితిలో ఖదీర్ కతా ప్రయాణం చెప్పేందుకు 
పూనుకోవడమే దుస్సాహసం.
1994 లో పుష్పగుచ్చం కథతో మొదలై నిన్నటి మెట్రోకథల దాకా ఖదీర్ రచనాయానం
, వ్యాసంగం చాలా dynamic, rapid, and indefatigable గా సాగుతూ వుంది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తనకు తాను ఒక కతా రచయితగా ఒక benchmark, target పెట్టుకున్నాడట.
గజమెత్తు పుస్తకాల రచన చేయడమే శ్రీపాద సంకల్పం. ఇక తక్కినదంతా మనకు తెలిసిన చరిత్ర.
గజమెత్తు పుస్తకాల సంకల్పం ఖదీర్ కు వుందో లేదో నాకు తెలియదు కానీ వాడి ‘రఫ్తార్’ చూస్తుంటే 
అది అలవోకగా చేయగల వాడి, వాశి పుష్కలంగా వున్న పెన్ను ఖదీర్ ది.
ఈ 20 ఏళ్ల లో ఖదీర్ publish చేసిన కథలూ, సంకలనాలూ దేనికవే విడివిడిగా 
గజమెత్తులో నిలిచి వీడిని ప్రతిసారీ గజారోహణం చేయిస్తూనే వున్నాయి. 
ఖదీర్ సృజన ప్రయాణం గురించి మాట్లాడటం అంటే నా మటుకు నాకు
 రెండు దశాబ్దాల మా చెక్కు చెదరని దోస్తానా గురించి పలవరించడమే.
 బహుజన వుద్యమాల కాలంలో మహోజ్వలంగా రగిలి, 
ఎదిగిన నిప్పు కణికల్లాంటి ఓ తరం సాహచర్యం పల్లవించడమే ఖదీర్ కతా ప్రస్థానం 
గురించి ప్రస్తావించడం అంటే. 
ఖదీర్ కతా సంవిధానం, కథనా నిర్వహణా Alfred Hitchcock వంటి మహా మహుల
 tight screenplay ని పోలి వుంటుంది. అల్లాంటి screenplay లో
 ఏ పేక కదిపినా కుప్ప కూలి పోతుంది విధానం. ఒక సీన్ ని తీసి వేసినా లేదా 
మనం ఆదమరిచి miss అయినా cinema లోని ఆత్మ మనకు అర్థం అవ్వాల్సిన
 మోతాదుల్లో , చేరాల్సిన రూపం లో అర్థం కాకుండా, చేరకుండా పోతుంది.
 పైగా అలా miss అయిన కొన్ని సార్లు ఆ సృజనకారుడి ఉద్దేశానికి పూర్తి 
భిన్నమైన అర్థం స్ఫురించేలా వుంటుంది. 
ఖదీర్ కథల్లో ఈ tight screenplay గుణం నిండుగా వుంటుంది. 
దీన్ని వీడు తర్ఫీదు చేసి మరీ సాధించాడు క్రమంగా.
ఖదీర్ కథల్లో నాజూకుగా, క్లుప్తంగా, గంభీరంగా, ఆర్ద్ర్హంగా, సూటిగా,
 అర్థవంతంగా అల్లుకుంటూ పోయిన, పెనవేసుకునిపోయిన 
నిర్మాణం ప్రత్యేక లక్షణంగా తళుక్కు మంటుంది. ఒకే ఒక్క వాక్యం...
 లేదా పదం తీసివేసినా మనకు అందవలిసిన తత్వం, మర్మం చేజారిపోతుంది. 
ఒకే ఒక్క పదమే ఒక ధిటవు వాక్యం లా నిలబెట్టే ఖదీర్ వాక్య నిర్మాణం లో
 తీసివేతలకు అస్సలు స్కోప్ వుండదు. నిజానికి ఒకే ఒక్క పదం రాసి దానిపక్క
 ధీమాగా full stop పెట్టాలంటే ఆ రచయితలు పోటుగాళ్ళయి వుండాలి.
 ఈ స్థాయి brevity ఖదీర్ వాక్యాలను నడుపుతున్న దివిటీ. 
ఈ స్థాయి క్లుప్తత ను సాధించడమే బహుశా గొప్ప కథకుల తర్ఫీదులోని కీలక లక్షణం.
 ఇదే ఏ రచయిత వివేకానికీ, పరిణతికీ అయినా సూచిక. నైపుణ్యానికి పరాకాష్ట. 
ఇది ఈ 20 ఏళ్లలో ఖదీర్ తన కథనా వ్యాసంగం నుంచి రాబట్టుకున్నాడు. 
అందుకే ఖదీర్ కథలు రాయడు. కథలు చెప్తాడు. రాయడం శ్రమ, నైపుణ్యాలను సూచిస్తే... 
కథ చెప్పడం అనేది శుద్ధ కళకు సూచిక.
కే‌వి మహాదేవన్ కు సంపాదకీయం ఇచ్చినా అద్భుతమైన పాట కట్టే వాడట. శుద్ధ కళకు సూచిక అదే.
O Henry, hotel లోని menu card చూసీ కథ అల్లేయగలను అని ధీమాగా ప్రకటించాడట. 
ఆ అల్లికయే కళ.
ఆ ధీమా, ఆ ease ఉన్నత సృజనకు ఊతం, ఆయువుపట్టూ. 
ఖదీర్ కథలు గమనిస్తే (కేవలం చదివితే అని కాదు నా వక్కాణింపు)
 గాలిలో చేతులు జొనిపి కతా పావురాలను సృష్టించి చకితులను చేయగల
 ఐంద్రజాలికుడిగా కథీరుడు గోచరమవుతాడు.
ఖదీర్ బాబు కు సన్మానం కథకు సన్మానం.
ఇది కావలి సాయబు గల్లీల లో గుంజాటనలో ఇంకా మగ్గుతున్న 
ఆ బడుగు జనాలకు సాదర సన్మానం.

Thursday 24 December 2015

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్ . 
ఇది జనవరి 2016 న ఇస్తారు . 
ఆ సందర్భంగా ఇంటర్వ్యు 

chintapalli ananth interview link