స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 31 December 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016

ఖదీర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016



ఖదీర్ బాబు గారితో చింతపల్లి అనంత్ గారి ఇంటర్వ్యు 
ఇవీ.)
దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు కథావరణంలో ఇంకా పుట్టని ఒక prodigal story teller కి 
అల్లా ఖర్రారు చేసిన పేరు మహమ్మద్ ఖదీర్ బాబు. 
ఇప్పుడు ఈ పేరు అసలు పరిచయమే అవసరం లేనంతగా చొచ్చుకువచ్చిన మెరుగైన, 
అపురూపమైన, మేలిమి, అరుదైన సంతకం. 
ఖదీర్ మా తరం తీర్చి దిద్దిన అందమైన, అర్థవంతమైన నిలువెత్తు సంతకం.
 ఇవాళ ఖదీర్ కు సన్మానం మా తరానికి సన్మానం. నా కన్నతల్లి కర్నూలులో,
నేను కన్న తొలి గంగాప్రవాహం హంద్రీ పేరిట ఖదీర్ కథలను ఇల్లా సన్మానించుకోవడం 
నాకు ప్రత్యేకించి సంతోషం. గర్వం. 
పరిచయ వాక్యాల పరిధిలో, పరిమితిలో ఖదీర్ కతా ప్రయాణం చెప్పేందుకు 
పూనుకోవడమే దుస్సాహసం.
1994 లో పుష్పగుచ్చం కథతో మొదలై నిన్నటి మెట్రోకథల దాకా ఖదీర్ రచనాయానం
, వ్యాసంగం చాలా dynamic, rapid, and indefatigable గా సాగుతూ వుంది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తనకు తాను ఒక కతా రచయితగా ఒక benchmark, target పెట్టుకున్నాడట.
గజమెత్తు పుస్తకాల రచన చేయడమే శ్రీపాద సంకల్పం. ఇక తక్కినదంతా మనకు తెలిసిన చరిత్ర.
గజమెత్తు పుస్తకాల సంకల్పం ఖదీర్ కు వుందో లేదో నాకు తెలియదు కానీ వాడి ‘రఫ్తార్’ చూస్తుంటే 
అది అలవోకగా చేయగల వాడి, వాశి పుష్కలంగా వున్న పెన్ను ఖదీర్ ది.
ఈ 20 ఏళ్ల లో ఖదీర్ publish చేసిన కథలూ, సంకలనాలూ దేనికవే విడివిడిగా 
గజమెత్తులో నిలిచి వీడిని ప్రతిసారీ గజారోహణం చేయిస్తూనే వున్నాయి. 
ఖదీర్ సృజన ప్రయాణం గురించి మాట్లాడటం అంటే నా మటుకు నాకు
 రెండు దశాబ్దాల మా చెక్కు చెదరని దోస్తానా గురించి పలవరించడమే.
 బహుజన వుద్యమాల కాలంలో మహోజ్వలంగా రగిలి, 
ఎదిగిన నిప్పు కణికల్లాంటి ఓ తరం సాహచర్యం పల్లవించడమే ఖదీర్ కతా ప్రస్థానం 
గురించి ప్రస్తావించడం అంటే. 
ఖదీర్ కతా సంవిధానం, కథనా నిర్వహణా Alfred Hitchcock వంటి మహా మహుల
 tight screenplay ని పోలి వుంటుంది. అల్లాంటి screenplay లో
 ఏ పేక కదిపినా కుప్ప కూలి పోతుంది విధానం. ఒక సీన్ ని తీసి వేసినా లేదా 
మనం ఆదమరిచి miss అయినా cinema లోని ఆత్మ మనకు అర్థం అవ్వాల్సిన
 మోతాదుల్లో , చేరాల్సిన రూపం లో అర్థం కాకుండా, చేరకుండా పోతుంది.
 పైగా అలా miss అయిన కొన్ని సార్లు ఆ సృజనకారుడి ఉద్దేశానికి పూర్తి 
భిన్నమైన అర్థం స్ఫురించేలా వుంటుంది. 
ఖదీర్ కథల్లో ఈ tight screenplay గుణం నిండుగా వుంటుంది. 
దీన్ని వీడు తర్ఫీదు చేసి మరీ సాధించాడు క్రమంగా.
ఖదీర్ కథల్లో నాజూకుగా, క్లుప్తంగా, గంభీరంగా, ఆర్ద్ర్హంగా, సూటిగా,
 అర్థవంతంగా అల్లుకుంటూ పోయిన, పెనవేసుకునిపోయిన 
నిర్మాణం ప్రత్యేక లక్షణంగా తళుక్కు మంటుంది. ఒకే ఒక్క వాక్యం...
 లేదా పదం తీసివేసినా మనకు అందవలిసిన తత్వం, మర్మం చేజారిపోతుంది. 
ఒకే ఒక్క పదమే ఒక ధిటవు వాక్యం లా నిలబెట్టే ఖదీర్ వాక్య నిర్మాణం లో
 తీసివేతలకు అస్సలు స్కోప్ వుండదు. నిజానికి ఒకే ఒక్క పదం రాసి దానిపక్క
 ధీమాగా full stop పెట్టాలంటే ఆ రచయితలు పోటుగాళ్ళయి వుండాలి.
 ఈ స్థాయి brevity ఖదీర్ వాక్యాలను నడుపుతున్న దివిటీ. 
ఈ స్థాయి క్లుప్తత ను సాధించడమే బహుశా గొప్ప కథకుల తర్ఫీదులోని కీలక లక్షణం.
 ఇదే ఏ రచయిత వివేకానికీ, పరిణతికీ అయినా సూచిక. నైపుణ్యానికి పరాకాష్ట. 
ఇది ఈ 20 ఏళ్లలో ఖదీర్ తన కథనా వ్యాసంగం నుంచి రాబట్టుకున్నాడు. 
అందుకే ఖదీర్ కథలు రాయడు. కథలు చెప్తాడు. రాయడం శ్రమ, నైపుణ్యాలను సూచిస్తే... 
కథ చెప్పడం అనేది శుద్ధ కళకు సూచిక.
కే‌వి మహాదేవన్ కు సంపాదకీయం ఇచ్చినా అద్భుతమైన పాట కట్టే వాడట. శుద్ధ కళకు సూచిక అదే.
O Henry, hotel లోని menu card చూసీ కథ అల్లేయగలను అని ధీమాగా ప్రకటించాడట. 
ఆ అల్లికయే కళ.
ఆ ధీమా, ఆ ease ఉన్నత సృజనకు ఊతం, ఆయువుపట్టూ. 
ఖదీర్ కథలు గమనిస్తే (కేవలం చదివితే అని కాదు నా వక్కాణింపు)
 గాలిలో చేతులు జొనిపి కతా పావురాలను సృష్టించి చకితులను చేయగల
 ఐంద్రజాలికుడిగా కథీరుడు గోచరమవుతాడు.
ఖదీర్ బాబు కు సన్మానం కథకు సన్మానం.
ఇది కావలి సాయబు గల్లీల లో గుంజాటనలో ఇంకా మగ్గుతున్న 
ఆ బడుగు జనాలకు సాదర సన్మానం.

Thursday 24 December 2015

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్ . 
ఇది జనవరి 2016 న ఇస్తారు . 
ఆ సందర్భంగా ఇంటర్వ్యు 

chintapalli ananth interview link




Sunday 25 October 2015

''మెట్రో సీరీస్ '' ముగింపు ''థాంక్యు ''

కధల చెట్టు చిన్న చివురు వేసింది 
మెట్రో చివురు 
ఇరవై కొమ్మలుగా వివిధ కోణాల్లో విస్తరిస్తూ 
చివురు చెట్టులోని ప్రాణ శక్తికి గుర్తు 
కలం చిత్రించే కొమ్మలు ఎన్నో కోణాల్లో 
తెలిసిన శైలి ,కొత్త శైలి 
కలగలిసి 
ఇప్పటి  మెట్రో జీవితాల్ని 
మన ముందు గమ్మత్తైన రంగులో ఆవిష్కరిస్తూ 
ఆరంభం ఆలు మగలు కలుసుకోవాలి 
అన్నా కొన్నిటిని వదిలేసుకోవాలి అనే పరిస్థతి 
అంతం ''థాంక్యు '' నే జీవితాన్ని 
అందంగా మలుచుకోవాలి అనేవారికి మంత్రం 
కధో వ్యధొ జీవితమో నిజమో 
ఒకటి మాత్రం నిజం ...... 
ఇప్పటికీ మనుషులు ఏదో రకంగా 
గృహస్తు గానే ఉండాలి అనుకుంటున్నారు  . 
ఇరవై కధలుగా సాగిన మెట్రో సీరీస్ ఈ రోజు తో అయిపొయింది . 
కధలు ఆగోచ్చు , కలం ఆగదు . ఇంకో ఆవిష్కరణ ఎక్కడో 
ఒక దగ్గర జరుగుతూ ఉంటుంది . 
మెట్రో సీరీస్ చివరి కధ  ''థాంక్యు '' చదవండి . 
మాట్లాడాలి అనుకుంటే ఖదీర్ బాబు గారి ఫోన్ నంబర్ అక్కడే ఉంది . 



Monday 14 September 2015

ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్

సెప్టంబర్  లో రెండు  విశేషాలు 
ఛాయ వారి ''కధకునితో సాయంత్రం '' 
ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్ 
మరి ఏది కధకునికి ఎక్కువ సంతోషం 
చదవరుల తో పంచుకున్న జ్ఞాపకాలా 
కష్టానికి లభించిన అవార్డు లా 
ఏమో రచయిత చెప్పాల్సిందే !


సారంగ వెబ్ మాగజైన్ లో విశేషాలు 
      ముస్లిం జీవితంపై 
  నవల రాయాలని వుంది: ఖదీర్
khadeer1


కృష్ణ మోహన్ బాబు 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ 
నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 
“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో 
మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి 
వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని 
తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”
అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.
“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. 
ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, 
పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత
 ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  
వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  
అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.
  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు 
“ఛాయా” కే ఇస్తాను.  
వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు”
 అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.
“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  
మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  
యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  
అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  
నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  
మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, 
“చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని. 
 నాకూ అలా కథలు రాయాలనిపించేది.  
10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు 
అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  
రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, 
నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు. 
 ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 
150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.
ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  
కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, 
వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  
పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, 
డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  
అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో 
ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి 
‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా. 
 నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, 
మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు 
అందరూ అక్కడ వుండేవారు.  

‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, 
అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  
ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని 
సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల 
మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.
  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  
అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన
 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  
అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు. 
 పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, 
రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.
khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం 
చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, 
రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  

నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని 
తీర్మానించుకున్నాను. 
 అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  
ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు. 
  ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.
  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, 
ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు. 
 నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు. 
 వారం వారం రాయాలి.  రాశాను. 
ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు. 
 హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల 
నుంచి చాలా నేర్చుకున్నాను.
కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు
 వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న 
ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, 
సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన 
అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం 
నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  
అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  
అతడు, ఆమె అని కూడా వుండవు.  
అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు. 
 ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో
 మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  
వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ 
అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే 
కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   

అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు 
రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా,
 సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు
 ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే
 ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’ 
 నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి. 
 రాస్తాను” అంటూ ముగించాడు.
ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ,
 ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు 
అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

Tuesday 25 August 2015

Sunday 16 August 2015

మెట్రో సీరీస్ వే టు గో

 సమస్య ఇప్పుడు జీవితానికి 
వెన్నెముక అయిపొయింది 
కాకుంటే అవెన్నో లెక్క తెలీడం లేదు 
ఇప్పుడు దాని పేరు మామూలు 

సమస్య మోసేవారికి 
కలం పట్టే శక్తి లేదు 
కలం పట్టగల వారికి 
సమస్య ను చూసే హృదయం లేదు 
ఇప్పుడు వ్రాసేవారికి 
వే టు గో ఫర్ 'ది ' రైటర్ 

ఖదీర్ గారి మెట్రో సీరీస్ కధలు ప్రతి ఆదివారం సాక్షి ఫ్యామిలీ లో చదవండి 




Tuesday 11 August 2015

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 
ఒక చక్కటి ఆనాటి యుగళ  గీతం. 
అంతే చక్కగా ఫీల్ గుడ్ సినిమా కు ఆ పేరే పెట్టారు . 
మరి చిన్నప్పటి నుండి ఒకరి మీద ఒకరికి అభిమానంగా 
ఉండే జంట ను కృష్ణమ్మ ఎలా కలిపిందో సినిమాలో 
చూడాల్సిందే . 
విశేషం ఏమిటంటే మాటల రచయిత గా ఇది ఖదీర్ గారి 
రెండో సినిమా . ఓనమాలకు మాటల రచయితగా పేరు 
నిలుపుకున్న ఖదీర్ గారు ఇక్కడ కూడా చక్కగా వ్రాసారు . 



Friday 31 July 2015

మసాన్ లో విరిసిన ఒక బంతిపువ్వు

 నిప్పు లో నెమ్ము  ఉంటుందా 
ఎందుకుండదు అదిగో కాలే కట్టె  చివర
నిప్పు మొదట్లో ఊరుతూ 
కొంచెం మనసుపై దూళి నులుముకొని చూడు 
నిప్పు కు తడి లేదు 
నిప్పు సాంగత్యం లో కట్టె కోల్పోతున్న మలినాల తడి అది 
బహుశా తనలో అన్ని మలినాలు ఉన్నాయని 
నిర్మాల్యమైన అగ్నిగా మారేవరకు దానికి కూడా తెలియక పోవచ్చు 

నిప్పు చేసే పని ఒక్కటే 
అది గర్భ గుడి లో అయినా 
స్మశానం లో కాలే చితిది అయినా
మాలిన్యాలను తొలగించడం 
అవి లోపలివో బయటవో 

కాసిన్ని విలువలు కావాలి ఇప్పుడు 
ప్రేమలో చావు వరకు వెళ్లి వచ్చిన వాళ్ళను 
ఇంకా నాలుకలతో చంపకుండా 
అప్పుడు ఒక స్త్రీ దైన్యాన్ని సెల్ ఫోన్ లో చూస్తే 
మన ఆడపడుచు గుర్తుకువస్తుంది 
ప్రమాదం లో పడిన మన వారి 
హాహాకారాలు గుర్తుకు వస్తాయి 

మసాన్ అంటే స్మశానం 
అక్కడ విలువలను ప్రశ్నిస్తూ పూచిన 
బంతి పువ్వు ఈ సినిమా 
మరి ఆ బంతి పువ్వు ఖదీర్ గారి కలం లో 
పరిమళాన్ని అద్దుకొని ఎన్ని హృదయాల్ని 
కదిలిస్తుందో చదివి చూడండి ......  
masam review link


Monday 27 July 2015

కొన్ని జ్ఞాపకాలు మరో సారి


కొన్ని జ్ఞాపకాలు
జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి
ఎక్కే మెట్ల మీద అలసట తీరడానికి
కాసింత ఆత్మ విశ్వాసం మన వెన్ను నిమరడానికి
 చేసిన తప్పు ఒప్పులు బేరీజు వేసుకోవడానికి
మనీషితనానికి ఇంకెంత దూరమో లెక్కించు కోవడానికి
అహం తో తూలామా పాతాళాని కే
బాధ్యత తో నిలిచామా శిఖరాగ్రాలకే
ఏదో ఒక మెట్టు మీద ఆగాల్సిందే
జ్ఞాపకాలలో అలుపు తీర్చుకోవాల్సిందే .......

జ్యోతి గారి అభిప్రాయం ''బియాండ్  కాఫీ మీద ''
ఇంకా సాక్షి ఫామిలీ లో ''మెట్రో కధలు '' ప్రతి ఆదివారం చదవండి 
(బహుశా మెట్రో కధలు పుస్తకం వస్తుంది . అందుకే ఇక్కడ అవి ఇవ్వడం లేదు )

. తీరుబాడికి స్త్రీత్వమ్ తోడైతే ఆ శాపం రెట్తింపై ఆది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్ బాబు పసికట్టాడు" అని ఈ పుస్తకం ముందుమాటలో రాస్తారు ఏ. గాంధీ, పీకాక్ క్లాసిక్స్ సంపాదకులు. "బియాండ్ కాఫీ" అనే కథ కాక ఇందులో మరో తొమ్మిది కథలున్నై. అన్ని కూడా ధనిక వర్గానికి చెందిన వ్యక్తుల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. "ఆస్తి" అనే కథ మనిషి జీవితపు ప్రయాణంలో రుచి చూసే ఎన్నో రకాల ఆస్తుల్ని గుర్తు చేస్తుంది. "నే మొహం ఆస్తి. ఈ ఇంటి గల్లోళ్ళు ఆ ఇంటి అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తినీ ఇవ్వలేదు. ఇచ్చిన ఆస్తినీ వాడు నిలబెట్టుకొలేదు" అంటూ ధనిక వర్గ యువత జీవన శైలిని చెప్పిన తీరు కదిలించింది. "టాక్ టైమ్" అనే కథ నాకు తెల్సిన వ్యక్తులను మరో మారు స్పురణకు తెచ్చింది. తమ వైవాహిక జీవితం లో చక్కగా ఒదిగిపోతూ తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ధనిక వర్గపు స్త్రీలు ఆచరించే విధానం కొన్ని నిజ జీవిత సంఘటనలను గుర్తుకు తెచ్చింది. నాకు బాగా నచ్చిన కథ, "ఏకాభిప్రాయం". స్త్రీని ముందు పరీక్షించి తనకు లొంగిపోతుంది అన్నప్పుడు పురుషుని ప్రవర్తన, లొంగదు అన్నప్పుడు తన నిజరూపాన్ని కప్పి పుచ్చుకుని మర్యాద అనే ముసుగు వేసుకోవడం ఈ కథ ఇతివృత్తం. నేటి ఆధునిక స్త్రీలు ఇటువంటి పురుషులను చూడకుండా ఉండరు. ఈ కథ లో పాత్రల స్వభావ చిత్రీకరణ నాకు ఈ రచయిత పుస్తకాలన్నీ చదవాలి అనే కోరిక కలిగించింది. "మచ్చ," "ఘటనా" అనే కథలలో పైకి కనపడని స్త్రీ ల ఫ్రష్టేషన్ ని రచయిత చూపించిన విధానం బావుంది." పట్టాయా... " అనే కథ వ్యభిచార కూపం లో మగ్గుతున్న యువతుల జీవితాన్ని మన ముందుకు తెస్తున్ది. ఈ కాన్సెప్ట్ తో ఎన్నో కథలు వచ్చాయి. కానీ ఈ కథ చదివిన తర్వాత కలిగిన ఫీలింగ్ చెప్పలేను. "ఆపాస్మారకం" కథలో కూడా స్త్రీ ని కామంతో చూసే మగవాని సహజ గుణం సంస్కారం అనే స్మారకం లో వచ్చినప్పుడు ఈ పురుషుడు అనుభవించే స్తితి ని రచయిత వర్ణించిన తీరు బావుంది. తల్లిగా బ్రతకాలి అని కోరుకునే ఒక సామాన్య స్త్రీ మానభంగానికి గురు అయ్యే ఘట్టం "ఇంకో వైపు" అనే కథలో వస్తుంది. ఈ కథలన్నీ మస్తిష్కాన్ని కదిలించి పారేస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంట్లో పర్సనల్ కాపీ గా పెట్టుకోవాల్సిన పుస్తకం. శైలిలో వాడి వేడి అన్నవి ఈ మధ్య కనిపించట్లేదు. ఆ కొరత ఈ కథల సంపుటి తీర్చింది. ఇంత పదునుగా ఉన్న శైలి ఈ మధ్య నేను చూడలేదు.


''కధా అవార్డ్ ''తీసుకున్న జ్ఞాపకం 

,,ee abbay maa hyderabad nunche'' ani adoor ku cheptunna abid hussain. pakkana hindi master writer krishna sobti. 2000 - katha award (for new bombay tailors)- new delhi



కీరవాణి గారితో 


Monday 13 July 2015

''సేల్ఫీ '' మెట్రో కధలు


భార్యా భర్తలు సంసార నౌకకి రెండు వైపుల ఉండి 
నడిపించే రెండు తెడ్లు లాంటి వాళ్ళు 
పక్క పక్కనే ఉన్నా లేకున్నా 
కాసింత దగ్గరితనం ఒకసారి 
కాసింత దూరపుదనం ఒకసారి 
కాపురం అంటే 
ఈ దగ్గర, దూరాల ఆట 
ఎందుకలాగా అంటే 
ఏమని చెపుతాము 
మనసును ఇంకా జయించడం నేర్చుకోని 
మనుషులం కాబట్టి 
కాలం తో పరిగెత్తే 
మర మనుషులం కాబట్టి ..... 

ఖదీర్ గారి శైలి లో ''సేల్ఫీ '' చదవండి . 



''డిస్టెన్స్ '' కధ చదవండి 




Monday 6 July 2015

వేంపల్లి షరీఫ్ గారిచే ఖదీర్ బాబు ఇంటర్యూ

వేంపల్లి షరీఫ్ గారిచే ఖదీర్ బాబు ఇంటర్యూ (1)
ప్రసిద్ధ కథారచయిత మహమ్మద్ ఖదీర్ బాబుతో  ఇంటర్వ్యూ మొదటి భాగం ఇది.








 రెండో భాగం ఆదివారం (5th july) రాత్రి తొమ్మిదిన్నరకు 99టీవీలో.


link here

part 2 link here 


Friday 3 July 2015

అమ్మమ్మ కధ . మెట్రో కధల సీరీస్

సీ ది ప్రోమో 


అమ్మమ్మ  కధ . మెట్రో కధల సీరీస్ 

''నెరిసిన తలలు వాడిపోతున్న పూవుల్లా 
అపార్ట్మెంట్ ల కిటికీలకు 
వేలాడతూ 
రోడ్డు మీద ఆగని హోరులో 
ఒక్క పచ్చని పలకరింపు కోసం వెతుకుతూ ''
చదవండి 



Wednesday 1 July 2015

కొన్ని కలక్షన్స్

కొన్ని కలక్షన్స్ . వీటి తరువాత ఇక మెట్రో కధల సీరీస్ 






కధకుల తో ఒక రోజు