పుట్టిన రోజు పండగే అందరికి
మనిషికి ఎన్ని పండుగలు
తొలి సారి ఊపిరి పీల్చినపుడు తల్లి నవ్వుతో ముద్దుల పండుగ
బోసి నవ్వులు లేత పెదాలపై విరిస్తే తోబుట్టువులతో అదో పండుగ
ఒక్కో అడుగు వామనుడిగా వేస్తె నాన్న నవ్వులతో అదో పండుగ
పరీక్షలను జయించి తొలి జీతం తో నిలబడితేస్నేహితుల మధ్య సంతోషాల పండుగ
ఒక తోడుని తన మనిషిగా చేర్చుకొని హృదయాన్ని పంచితే సరాగాల పండుగ
మన రూపాన్ని చేతిలోకి తీసుకొని మీసాలు పీకించుకుంటే అదో మురిపాల పండుగ
మానవత్వాన్ని మర్చిపోక మన పిడికిలి మెతుకుల్లో
రెండు మెతుకులు పక్క వాడికి పెట్టిన రోజు
దేవుడు తన ప్రతిరూపాన్నివాడిలో చూసుకొనే నిజమైన పండుగ .....
ఏప్రిల్ 28 పుట్టిన రోజు జరుపుకొనే ఖదీర్ బాబు గారికి
ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో అవార్డ్ లు గెలుచుకుంటూ
అందరితో సంతోషాన్ని పంచుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ
ఈ బ్లాగ్ తరుపున శుభాకాంక్షలు

No comments:
Post a Comment