ఒక రచయితకు తన సొంత ఊరిలో జరిగే కార్యక్రమం లో
పాల్గొనటం అంటే చాలా ఆనందదాయకం గా ఉంటుంది.
అందులో సహృదయుల ఫంక్షన్ అయితే ఇంకా సంతోషం గా
ఉంటుంది.
మొన్న 02/12/2012 న నెల్లూరు లో టౌన్ హాల్ లో
''నాగభైరవ కోటేశ్వరరావు''గారి అవార్డ్ ''తనికెళ్ళ భరణి''
గారికి ఇవ్వడం జరిగింది.నాగభైరవ కోటేశ్వర రావు గారు
ఎందరికో గురు తుల్యులు.ఆ సభలో ''ఖదీర్ బాబు''గారు
కూడా అతిధులుగా పాల్గొన్నారు.
సభ జరిగేటపుడు కాని,''మిధునం''ఆడియో రిలీజ్ అపుడు
కాని భరణి గారు ''ఖదీర్ రావయ్యా''అని ఆప్యాయంగా
పిలవడం ఇద్దరు నవ్వుకుంటూ రిలీజ్ ఫంక్షన్ చూడటం
తప్పకుండా ఖదీర్ గారికి మధుర జ్ఞాపకం గా ఉండి ఉంటుంది.
సభ లో ''ఖదీర్''గారు ఇలాంటి ఒక మంచి వ్యక్తి గుర్తుగా
జరిపే ఈ ఫంక్షన్ లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా
ఉందని చెప్పడం గమనించ తగినది.
కొన్ని ఫోటోలు ఇక్కడ ఇవ్వడం జరిగినది.
No comments:
Post a Comment