స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Wednesday, 5 December 2012

''ఖాదర్ లేడు ''ఒక అభిప్రాయం

కాలాస్త్రి బ్లాగర్ శ్రీ గారి అభిప్రాయం ''ఖాదర్ లేడు ''
పై.....
ఒక సారి రీటైలర్స్ కి ద్వారాలు తెరిచే ప్రభుత్వాలు ఇది 
చదివితే బాగుండును.
థాంక్యు శ్రీ గారు 
లింక్ ఇక్కడ  
kalas3 blog





నెల్లూరులో ట్రంకు రోడ్ ఉన్నట్టే కావలిలో కూడా ఒక ట్రంక్ రోడ్ ఉంది. ఊరిలో ఎవరికి ఏమి కావాలన్నా ట్రంకు రోడ్ కి రావలసిందే. బైసాని వెంకటసుబ్బయ్యకి తండ్రి ద్వారా సంక్రమించిన అంగడి ఈ ట్రంక్ రోడ్ మీదనే ఉంటుంది. రోడ్ కి రెండు వైపులా ఉన్న మార్జిన్ లో చిన్నా, చితకా వ్యాపారస్థులు ఉంటారు. ఖాదర్ కి కూడా ఇలాంటి మార్జిన్ షాపే ఉంటుంది. కొన్ని సైకిళ్ళు అద్దెకి ఇచ్చుకుంటూ రిపేర్లు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఖాదర్.

వీళ్ళిద్దరకీ పరిచయం గమ్మత్తుగా జరుగుతుంది. బైసాని వయసులో ఖాదర్ కంటే చిన్నోడు. పిలకాయలు తొక్కుకునే సైకిళ్ళు ఖాదర్ దగ్గరే దొరుకుతాయి. బైసాని తరచూ సైకిలు అద్దెకి తీసుకుంటూ ఉండడముతో ఇద్దరికీ పరిచయం పెరుగుతుంది. సైకిల్ షాపులో ఖాళీ దొరికితే ఖాదర్, బైసాని షాపు దగ్గరకి వచ్చి కూర్చునేవాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఖాళీ సమయాల్లో. బైసాని, ఖాదర్ కి కొన్ని వ్యాపార సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఖాదర్ కూడా వాటిని పాటిస్తూ వ్యాపారం పెంచుకుంటూ ఉంటాడు.  

ఒక రోజు ట్రంకు రోడ్ వెడల్పు చేసే పనిలో మార్జిన్ షాపులన్నిటినీ పీకేస్తారు అధికారులు. బైసాని అంగడిని కూడా కొంచెం రోడ్ మీదకు ఉందని బుల్ డోజర్లతో కొంత పడగొట్టేసారు. ఖాదర్ షాపు పూర్తిగా పీకి పారేస్తారు. నాలుగురోజులూ బజారు వెళ్ళిన బైసాని ఒక్క ఆదివారం మాత్రం వెళ్ళడు. అన్ని రోజులూ కనపడిన ఖాదర్ ఆదివారం నుండి కనపడడు. ఖాదర్ ఎటు వెళ్ళాడో తెలియదు, బజారులో కనిపించిన వాళ్ళనంతా అడుగుతూ ఉంటాడు.

కథ ముచ్చటగా ముప్పయ్ పేజీలు కూడా ఉండదు. నాకు చదవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, తొందరగా చదివే వాళ్ళకయితే సరిగ్గా అరగంట కూడా పట్టదు. చదవడానికి అరగంట పట్టినా పూర్తి చేసాక దీని జ్ఞాపకాలు చాలా సేపు వెంటాడుతాయి. బజారులో పెద్ద అంగడి వ్యాపారాలు వేరు, రోడ్ పక్కన చిన్న చిన్న వ్యాపారు వేరు. ఈ చిన్న వ్యాపారస్తుల జీవితాల గురించే ఈ కథ. వీళ్ళ పెట్టుబడులంతా చూస్తే వెయ్యి, రెండు వేల కంటే ఎక్కువ కాదు. ఆరోజుకి గడిస్తే చాలు అని జీవిస్తూ ఉంటారు. 

రోడ్ వెడల్పు చేయడం మంచిదే, కాకపోతే ఖాదర్ లాంటి చిన్న వ్యాపారస్థులు చేసుకునే వ్యాపారాలు పీకేయడం మంచిది కాదు. ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తే మంచిదని రచయిత మనకి చెప్పాలని ప్రయత్నించాడు. వీళ్ళకి ఉండడానికి ఇళ్ళు ఉండదు, ఎక్కడో ఒక చోట కొంత స్థలం ఆక్రమించి అక్కడ ఉండిపోతారు. అప్పటికి ఇందిరమ్మ ఇళ్ళు లేవు, లేకపోతే ఖాదర్ ఒక ఇంటివాడయి ఉండేవాడేమో!

చిన్నపుడు రాపూరులో నేను కూడా చిన్న సైకిళ్ళు అద్దెకి తీసుకున్నాను. అందరిదగ్గరా ఈ సైకిళ్ళు ఉండవు, ఊరిలో కొంత మంది దగ్గరే ఉంటాయి. బైసాని చిన్న సైకిల్ రెంటు చేయడం నన్ను నా చిన్నప్పటి జ్ఞాపకాలకి తీసుకువెళ్ళింది. కథలో నెల్లూరు యాస చూసి కడుపు నిండింది. ఈ పుస్తక రచయిత మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కథలు కూడా బాగుంటాయని విన్నాను.

No comments:

Post a Comment