సృజనాత్మకతకు మూలాలు
ఎక్కడ ఉంటాయో తెలుసా?
వాళ్ళ బాల్యం లోనే.......
చిన్నతనం లో
నాయనమ్మ అందించిన కధల స్పూర్తిని మనసులో
దాచుకొని కధల వృక్షం గా ఎదిగి సమాజాన్ని ప్రశ్నిస్తున్న
శక్తి ఖదీర్ బాబు.పూర్తి పేరు మహ్మద్.ఖదీర్ బాబు.
వీరు 1972 లో నెల్లూరు జిల్లా కావలి లో జన్మించినారు.
ఇంటర్ లో నూనూగు మీసాల లేత ప్రాయం లో సరదా కధలతో
మొదలైన రచనా వ్యాసంగం ,తన తండ్రి చిన్న వ్యాది తొ, ఆర్ధిక
ఇబ్బందులతో సరైన వైద్యం అందక చనిపోవడం తొ సమాజపు
అసమానతల వైపు మళ్ళింది.
తన చుట్టూ ఉన్న తన వారి స్తితిగతుల గమనించినపుడు
కలిగే కోపం వేదనగా రగిలి అక్షరాలుగా మారి
తన వారిని చైతన్య పరుచుటే గాక
సమాజాన్ని తమ వారి వైపు చూడమని ప్రశ్నించింది.
డిగ్రీ తరువాత ఉద్యోగం లో చేరిన అయన 24 సంవత్సరాల
వయసులో తండ్రి మరణం తొ రగిలిన కోపం కధలుగా
రూపొంది సమాజం వైపు ఇప్పటికి తన ప్రశ్నలను సందిస్తూ
భావాలకు పదును పెడుతూనే ఉంది.
1997 లో వ్రాసిన మొదటి కధ ''దావత్''కు నేషనల్ అవార్డ్
సాదించినారు.''నామిని సుబ్రహ్మణ్యం నాయుడు''గారి
ప్రోత్సాహం తొ తన వారి సమస్యలు హృదయాలకు హత్తుకునే
రీతిలో లోకం ముందుకు కధలుగా తీసుకుని వచ్చారు.
1999 లో ''జమీన్''అనే కధకు ''కధాఅవార్డ్''ని ఇంకా
''బాషా సమ్మాన్ అవార్డ్'' ని పొంది ఉన్నారు.
మొదట ''ఫీచర్ జర్నలిస్ట్''గా ''ఆంద్రజ్యోతి '' పని చేసిన వీరు
ప్రస్తుతం ''సాక్షిఫ్యామిలీ'' ఇంచార్జ్ గా బాధ్యతలు
నిర్వహిస్తున్నారు.
ఈయన వ్రాసిన కధాసంకలనాలు ''దర్గామిట్ట కధలు''
''పోలేరమ్మ బండ కధలు'' ''పప్పు జాన్ కధలు''
''మాన్ సే గీత్''(హిందీ సినిమా సంగీతం )
ఇవి కాక ఇటీవల ''న్యు బాంబే టైలర్స్'' బహుళ
ప్రజాదరణ పొందినాయి.
ఇవి కాక ఈమధ్య విడుదల అయిన ''ఓనమాలు''
సంభాషణా రచయిత గా మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు.
(హెచ్.ఎం.టి.వి. లో వందేళ్ళ కధ లో ''ఖదీర్ బాబు''ఇంటరవ్యు లింక్ ఇక్కడ )
No comments:
Post a Comment