స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Tuesday, 15 January 2013

నయ్యర్ కు అక్షర నివాళి

''రాజు మరణించే ఒక తార రాలిపోయే 
కవియు మరణించే ఒక తార గగనమెక్కె''
అవును కవులే కాదు కళాకారులు అందరు 
గగనం లో నిలిచిపోయే తారలే.లేకుంటే ఇన్ని కొత్త 
నక్షత్రాలు ఎక్కడి నుండి వస్తాయి.
ఒక నటన ఎక్కడో చివరి అంకం లో ఆగిపోతుంది....
తారగా మిగిలి పోతుంది....
ఒక గాత్రం ఊపిరిగా మారి ఎగసిపోతుంది......
ఒక తారగా మిగిలిపోతుంది.
పోయినోళ్ళందరూ మంచోళ్ళే ,కాని వాళ్లకు తమను 
గూర్చి ఒక్క కళా హృదయం తలుచుకోదా ,అక్షర తర్పణం 
వదలదా? అనే చిన్న కోరిక ఉంటుంది.

అదిగో ఎదురు చూపులకు మాటల మంత్రం వేస్తూ వస్తాడు 
ఖదీర్ బాబు ''గాతే రహే మేరె దిల్''అంటూ అక్షరాల బూర ఊదేసి 
చనిపోయిన వారి ప్రపంచానికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాడు అందరిని.
''అదిగో అతని గొంతు మెత్తని గాజుని తట్టినట్లు అంటాడు.....
ఇదిగో ఇతని నటన కళామతల్లికి పూలు పూచినట్లు అంటాడు....
అందరు వెలివేసినా ,అణగద్రోక్కినా వారి గొప్పతనాన్ని ఈ 
అక్షరాలలో పరిచయం చేసినందుకు పైకి వెళ్ళిన వారి మది 
ఉప్పొంగుతుంది.ఆ అక్షరాలకు ఆశీస్సుల మాధుర్యం అద్దుతుంది. 
''ఓ చెలి కోపమా'' అంటూ దంపతుల అలక ముచ్చట ని ముచ్చటగా 
పలికించిన ''నయ్యర్....ఓంకార్ ప్రసాద్ నయ్యర్''గూర్చి 
ఖదీర్ బాబు గారి కలం నుండి వెలువడిన అశ్రునివాళి .......
ఆర్టికల్ లింక్ ఇక్కడ
(నయ్యర్ మిగిల్చిన పాటలు లింక్ )

(నయ్యర్ మిగిల్చిన పాటల లింక్ రెండో భాగం )



No comments:

Post a Comment