వసంతం ఎంత బాగుంటుంది!
ఎన్నో పూలరంగులు బుగ్గలకు పూసుకుంటూ
ఆలా చెట్లు నవ్వులతలలు ఊపుతూ ఉంటే
ఏడాదికి ఎన్నోసార్లు వసంతం వస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది
మళ్ళీ మళ్ళీ ఆ సువాసనమోహం లో మునిగిపోయినాసరే
ఆ పూలరంగులను మనసులో దాచుకోవాలి అనిపిస్తుంది
ఈ కొత్త కథా వసంతం మాత్రం తక్కువా ఏమిటి!
మోదుగ ఎరుపు విప్లవాలు
మొగలిపూవులా చురుక్కుమనిపించేవి
ప్రేమ గులాబిరంగును అద్దేవి
ప్రపంచీకరణ ను చూపే లిల్లీలు
మనసును ఒక పట్టాన వదలని మల్లెలు
బోలెడు ఆలోచనలను మనపై రాల్చే పొగడలు
తమ ఉనికి చిన్నదైనా సఫలతను చేరుకొనే సొగసు పారిజాతాలు
ఎన్నో కలాల కొమ్మలకు పూచిన పూలను ఒకటిగా చేర్చిన దారం ఒక్కటే
రండి ఆ వసంతాన్ని చూసి మళ్ళీ మళ్ళీ రావాలని పిలుద్దాము ....
కొత్త కథ ఆవిష్కరణ ఆదివారం 21-7-2019 న... ఇదే అందరికీ ఆహ్వానం..
ఖదీరుగారి మాటల్లోనే ఆహ్వానం అందుకోండి!
అందరూ...
బెజవాడ నుంచి సత్యవతి గారొస్తున్నారు.
మంచిర్యాల నుంచి రాజన్న. బెంగళూరు నుంచి వివిన మూర్తిగారు.
చెన్నై నుంచి అరాత్తు. ఇతర ఊర్ల నుంచి మిత్రులు.
ఇంకా హైదరాబాద్‌లోని చాలా దారులు రాబోయే ఆదివారం నాంపల్లి వైపు చూస్తాయి.
కొత్త కథ 2019 ఆవిష్కరణ అంటే సాహితీ మిత్రులంతా జత కూడే వేడుక.
ముందుతరం రచయితలకు కృతజ్ఞత ప్రకటించే ఉత్సవం. తేదీ గుర్తుపెట్టుకోండి.