స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Friday, 31 July 2015

మసాన్ లో విరిసిన ఒక బంతిపువ్వు

 నిప్పు లో నెమ్ము  ఉంటుందా 
ఎందుకుండదు అదిగో కాలే కట్టె  చివర
నిప్పు మొదట్లో ఊరుతూ 
కొంచెం మనసుపై దూళి నులుముకొని చూడు 
నిప్పు కు తడి లేదు 
నిప్పు సాంగత్యం లో కట్టె కోల్పోతున్న మలినాల తడి అది 
బహుశా తనలో అన్ని మలినాలు ఉన్నాయని 
నిర్మాల్యమైన అగ్నిగా మారేవరకు దానికి కూడా తెలియక పోవచ్చు 

నిప్పు చేసే పని ఒక్కటే 
అది గర్భ గుడి లో అయినా 
స్మశానం లో కాలే చితిది అయినా
మాలిన్యాలను తొలగించడం 
అవి లోపలివో బయటవో 

కాసిన్ని విలువలు కావాలి ఇప్పుడు 
ప్రేమలో చావు వరకు వెళ్లి వచ్చిన వాళ్ళను 
ఇంకా నాలుకలతో చంపకుండా 
అప్పుడు ఒక స్త్రీ దైన్యాన్ని సెల్ ఫోన్ లో చూస్తే 
మన ఆడపడుచు గుర్తుకువస్తుంది 
ప్రమాదం లో పడిన మన వారి 
హాహాకారాలు గుర్తుకు వస్తాయి 

మసాన్ అంటే స్మశానం 
అక్కడ విలువలను ప్రశ్నిస్తూ పూచిన 
బంతి పువ్వు ఈ సినిమా 
మరి ఆ బంతి పువ్వు ఖదీర్ గారి కలం లో 
పరిమళాన్ని అద్దుకొని ఎన్ని హృదయాల్ని 
కదిలిస్తుందో చదివి చూడండి ......  
masam review link


Monday, 27 July 2015

కొన్ని జ్ఞాపకాలు మరో సారి


కొన్ని జ్ఞాపకాలు
జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి
ఎక్కే మెట్ల మీద అలసట తీరడానికి
కాసింత ఆత్మ విశ్వాసం మన వెన్ను నిమరడానికి
 చేసిన తప్పు ఒప్పులు బేరీజు వేసుకోవడానికి
మనీషితనానికి ఇంకెంత దూరమో లెక్కించు కోవడానికి
అహం తో తూలామా పాతాళాని కే
బాధ్యత తో నిలిచామా శిఖరాగ్రాలకే
ఏదో ఒక మెట్టు మీద ఆగాల్సిందే
జ్ఞాపకాలలో అలుపు తీర్చుకోవాల్సిందే .......

జ్యోతి గారి అభిప్రాయం ''బియాండ్  కాఫీ మీద ''
ఇంకా సాక్షి ఫామిలీ లో ''మెట్రో కధలు '' ప్రతి ఆదివారం చదవండి 
(బహుశా మెట్రో కధలు పుస్తకం వస్తుంది . అందుకే ఇక్కడ అవి ఇవ్వడం లేదు )

. తీరుబాడికి స్త్రీత్వమ్ తోడైతే ఆ శాపం రెట్తింపై ఆది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్ బాబు పసికట్టాడు" అని ఈ పుస్తకం ముందుమాటలో రాస్తారు ఏ. గాంధీ, పీకాక్ క్లాసిక్స్ సంపాదకులు. "బియాండ్ కాఫీ" అనే కథ కాక ఇందులో మరో తొమ్మిది కథలున్నై. అన్ని కూడా ధనిక వర్గానికి చెందిన వ్యక్తుల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. "ఆస్తి" అనే కథ మనిషి జీవితపు ప్రయాణంలో రుచి చూసే ఎన్నో రకాల ఆస్తుల్ని గుర్తు చేస్తుంది. "నే మొహం ఆస్తి. ఈ ఇంటి గల్లోళ్ళు ఆ ఇంటి అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తినీ ఇవ్వలేదు. ఇచ్చిన ఆస్తినీ వాడు నిలబెట్టుకొలేదు" అంటూ ధనిక వర్గ యువత జీవన శైలిని చెప్పిన తీరు కదిలించింది. "టాక్ టైమ్" అనే కథ నాకు తెల్సిన వ్యక్తులను మరో మారు స్పురణకు తెచ్చింది. తమ వైవాహిక జీవితం లో చక్కగా ఒదిగిపోతూ తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ధనిక వర్గపు స్త్రీలు ఆచరించే విధానం కొన్ని నిజ జీవిత సంఘటనలను గుర్తుకు తెచ్చింది. నాకు బాగా నచ్చిన కథ, "ఏకాభిప్రాయం". స్త్రీని ముందు పరీక్షించి తనకు లొంగిపోతుంది అన్నప్పుడు పురుషుని ప్రవర్తన, లొంగదు అన్నప్పుడు తన నిజరూపాన్ని కప్పి పుచ్చుకుని మర్యాద అనే ముసుగు వేసుకోవడం ఈ కథ ఇతివృత్తం. నేటి ఆధునిక స్త్రీలు ఇటువంటి పురుషులను చూడకుండా ఉండరు. ఈ కథ లో పాత్రల స్వభావ చిత్రీకరణ నాకు ఈ రచయిత పుస్తకాలన్నీ చదవాలి అనే కోరిక కలిగించింది. "మచ్చ," "ఘటనా" అనే కథలలో పైకి కనపడని స్త్రీ ల ఫ్రష్టేషన్ ని రచయిత చూపించిన విధానం బావుంది." పట్టాయా... " అనే కథ వ్యభిచార కూపం లో మగ్గుతున్న యువతుల జీవితాన్ని మన ముందుకు తెస్తున్ది. ఈ కాన్సెప్ట్ తో ఎన్నో కథలు వచ్చాయి. కానీ ఈ కథ చదివిన తర్వాత కలిగిన ఫీలింగ్ చెప్పలేను. "ఆపాస్మారకం" కథలో కూడా స్త్రీ ని కామంతో చూసే మగవాని సహజ గుణం సంస్కారం అనే స్మారకం లో వచ్చినప్పుడు ఈ పురుషుడు అనుభవించే స్తితి ని రచయిత వర్ణించిన తీరు బావుంది. తల్లిగా బ్రతకాలి అని కోరుకునే ఒక సామాన్య స్త్రీ మానభంగానికి గురు అయ్యే ఘట్టం "ఇంకో వైపు" అనే కథలో వస్తుంది. ఈ కథలన్నీ మస్తిష్కాన్ని కదిలించి పారేస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంట్లో పర్సనల్ కాపీ గా పెట్టుకోవాల్సిన పుస్తకం. శైలిలో వాడి వేడి అన్నవి ఈ మధ్య కనిపించట్లేదు. ఆ కొరత ఈ కథల సంపుటి తీర్చింది. ఇంత పదునుగా ఉన్న శైలి ఈ మధ్య నేను చూడలేదు.


''కధా అవార్డ్ ''తీసుకున్న జ్ఞాపకం 

,,ee abbay maa hyderabad nunche'' ani adoor ku cheptunna abid hussain. pakkana hindi master writer krishna sobti. 2000 - katha award (for new bombay tailors)- new delhi



కీరవాణి గారితో 


Monday, 13 July 2015

''సేల్ఫీ '' మెట్రో కధలు


భార్యా భర్తలు సంసార నౌకకి రెండు వైపుల ఉండి 
నడిపించే రెండు తెడ్లు లాంటి వాళ్ళు 
పక్క పక్కనే ఉన్నా లేకున్నా 
కాసింత దగ్గరితనం ఒకసారి 
కాసింత దూరపుదనం ఒకసారి 
కాపురం అంటే 
ఈ దగ్గర, దూరాల ఆట 
ఎందుకలాగా అంటే 
ఏమని చెపుతాము 
మనసును ఇంకా జయించడం నేర్చుకోని 
మనుషులం కాబట్టి 
కాలం తో పరిగెత్తే 
మర మనుషులం కాబట్టి ..... 

ఖదీర్ గారి శైలి లో ''సేల్ఫీ '' చదవండి . 



''డిస్టెన్స్ '' కధ చదవండి 




Monday, 6 July 2015

వేంపల్లి షరీఫ్ గారిచే ఖదీర్ బాబు ఇంటర్యూ

వేంపల్లి షరీఫ్ గారిచే ఖదీర్ బాబు ఇంటర్యూ (1)
ప్రసిద్ధ కథారచయిత మహమ్మద్ ఖదీర్ బాబుతో  ఇంటర్వ్యూ మొదటి భాగం ఇది.








 రెండో భాగం ఆదివారం (5th july) రాత్రి తొమ్మిదిన్నరకు 99టీవీలో.


link here

part 2 link here 


Friday, 3 July 2015

అమ్మమ్మ కధ . మెట్రో కధల సీరీస్

సీ ది ప్రోమో 


అమ్మమ్మ  కధ . మెట్రో కధల సీరీస్ 

''నెరిసిన తలలు వాడిపోతున్న పూవుల్లా 
అపార్ట్మెంట్ ల కిటికీలకు 
వేలాడతూ 
రోడ్డు మీద ఆగని హోరులో 
ఒక్క పచ్చని పలకరింపు కోసం వెతుకుతూ ''
చదవండి 



Wednesday, 1 July 2015

కొన్ని కలక్షన్స్

కొన్ని కలక్షన్స్ . వీటి తరువాత ఇక మెట్రో కధల సీరీస్ 






కధకుల తో ఒక రోజు