స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Tuesday, 30 July 2013

''బియాండ్ కాఫీ ''మంచి కాఫీ లాంటి పుస్తకమా?

''బియాండ్ కాఫీ ''మంచి కాఫీ లాంటి పుస్తకమా?

ఖదీర్ గారి రాబోయే కధా సంకలనం పేరు ''బియాండ్ కాఫీ '' 
వివిధ కోణాలలో వ్రాసిన జీవిత వాస్తవాలు అని విడుదల చేసిన 
ఫొటోఇమేజస్  వలన తెలుస్తుంది . 

మంచి కాఫీ లాగా త్రాగి వదిలేసేవి గాక 
వాస్తవ జీవితానికి కాపీ గా ఉంటాయి అనుకుంటున్నాము . 

మరి ఇంకొన్ని విశేషాలు చూడండి :)

బియాండ్ కాఫీ డి . టి . పి ని చూస్తున్న ఖదీర్ బాబు గారు ,మల్లేష్ గారు 


కధల గూర్చి ''పార్ధ సారధి ''గారితో చర్చిస్తూ .... 



Thursday, 18 July 2013

కధా అవార్డ్ ఎంత చక్కటి జ్ఞాపకం


ఎంత చక్కటి జ్ఞాపకం ... ఇలాటివే ముందుకు మనం ఇంకా 
సాగాలసిన స్పూర్తిని ఇస్తూ ఉంటాయి 
''ఈ అబ్బాయి మన హైదరాబాద్ నుంచే ..... అని అదూర్ కు చెపుతున్న అబిద్ హుస్సేన్ ''
పక్కన హింది మాష్టర్ రచయిత కృష్ణ సోబ్తి 
''కధా అవార్డ్ ''(న్యు బాంబే టైలర్స్ కి ఢిల్లీ లో ప్రధానం చేస్తున్నప్పుడు )

ఖదీర్ గారి కొత్త కధా  సంకలనం రాబోతుంది 
అన్నిటికి ఫోటో ఇమేజెస్ కూడా ప్రచారం లో ఉంచారు 
ఎలా ఉంటాయో అని పాటకులు ఆసక్తి తో చూడటం ,సంకలనం 
వచ్చిన తరువాత ఆ కధా ప్రవాహం లో కొట్టుకొని పోవడం .... అంతే 
ఒక్కోటి ఒక్కో జీవిత కోణం ,ఏదో ప్రత్యేకత కూడా ఉంది అన్నారు 
ఖదీర్ గారు . ఏమిటో వేచి చూడండి 


Tuesday, 9 July 2013

మూడు కధలు త్వరలో ..... ఆ కలం నుండి

అరవిరిసిన పచ్చదనం
కళ్ళకు హాయి నిచ్చే వర్ణం
లేత పూరేకుల స్పర్శ
ఎన్ని ఇస్తే ఏమి లాభం ?
అవి జీవిత ఊపిరి లేని
కృత్రిమ మొక్కలు అయితే

అదిగో అక్కడుంది ఊపిరి
మనిషి జీవన మాధుర్యాన్ని పీల్చుకుంటూ
ఆయన కలం లో అక్షరాలుగా
ఊపిరి పోసుకొని
తెల్ల కాగితానికి కొత్త మాధుర్యాన్ని అద్దుతూ 

చదవండి ''ఖదీర్ ''గారి కలం లో నుండి రాలే
మూడు కధా  పుష్పాలని త్వరలో
ఇక్కడ ఫోటో ఇమేజెస్ చూడండి






(08/07/2013 sakshi sahityam link ikkada )



మూడు కధలు త్వరలో ..... ఆ కలం నుండి