స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Wednesday, 13 July 2016

ఇంకో భాష కి ఒక అడుగు

ఒక్క దగ్గరే ఉండిపోవడం 
ఏమి బాగుంటుంది అని 
నది అయినా కధ అయినా 
ఇంకో బాష వాళ్లకి ఆ మాధుర్యం 
అందవద్దా అనువాదకుల కలం 
లో ప్రవహించి 
మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ తన తాజా 
300 పేజీల ఓనమ్ సాహిత్య సంచికలో ‘న్యూ బాంబే టైలర్స్’
 కథను ప్రచురించింది. అర్థవంతమైన బొమ్మలతో ఈ కథను
 ప్రెజెంట్ చేస్తూ భారతీయ భాషలలో వచ్చిన 
అత్యుత్తమ కథల్లో ఇది ఒకటిగా మెచ్చుకుంది. 
మాతృభూమి లోకల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి
 నాకు ఈ విషయం చెప్పారు. 
అనువాదకుడు ఎవరో తెలియదు. ...ఖదీర్ బాబు 


నవ్వుల నెలవంకలు మెరవక పొతే ఈద్ ఎలా వస్తుంది ?
జ్ఞాపకమయి ఎలా మెరుస్తుంది ?



Tuesday, 21 June 2016

ఒక లెసెన్

ఒక లెసెన్
అనుకుని ఉంటాడా 
కావలి వీధుల్లో ఆడుతూ అల్లరిగా తిరిగే 
ఆ బక్క పలుచటి అబ్బాయి 
తన జీవితం లోని ఒక ముక్క
భవిష్యత్తులో తన కలం నుండి జాలువారి 
తన వాళ్ళ ప్రతిబింబాన్ని లోకానికి చూపిస్తుందని !
తానే పంతులయి మిగిలిన ఆచార్యులకు దానిపై 
వివరిస్తాను అని 

ప్రతి శిశువు లో ఉన్న సార్ధకత దేవుడు ఎప్పుడో 
పొదిగి ఉంటాడు . 

తన దర్గా మిట్ట కథ లెసెన్ గా పొందుపరచినందుకు 
ఖదీర్ బాబు కు అభినందనలు 






Sunday, 29 May 2016

కుదిరితే నాలుగు మాటలు

కుదిరితే నాలుగు మాటలు 
అని ''బ్రహ్మోత్సవం ''టీం అలా 
అడిగారో లేదో ఇలా కుదిరించుకొని 
మాట సహాయం చేసారు ఖదీర్ గారు 

మరి ఈ దర్శక రత్న గారు కధల బుక్ చదివినాక 
ఏ జస్టీస్ చౌదరికి వ్రాస్తారో !
''నాటా '' సాహిత్య సమావేశాలకు వెళుతున్నందుకు ఖదీర్ గారికి అభినందనలు 

ఆ కధల బుక్ గురించి బ్లాగర్ వనజ తాతినేని గారి అభిప్రాయం చూడండి . 



"కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన ఉత్తేజం, మిగిల్చిన అనుభూతి, ఏర్పడిన నా అవగాహన ఇది.
మహ్మద్ ఖధీర్ బాబు గారికి వైభోగం పట్టుకుంది . ఇది నేనన్న మాట కాదు ఆయన మాటల్లోనే! లేకపోతే మిట్ట మధ్యాహ్నం మండి పోయే మా బ్లేజ్ వాడ పుర వీధుల్లో ఏలూరురోడ్ లో విశాలాంధ్రని వెదుక్కుంటూ నేను వెళ్ళడం ఏమిటీ ?
నిజంగా పాఠకులు ఒక పుస్తకం కోసం వెదుక్కుంటూ వెళ్ళడం అంటే కచ్చితంగా అది రచయితకి పట్టిన వైభోగమే! అలా విశాలాంధ్ర లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట మాట్లాడిన మాట ఖదీర్ బాబు గారి కొత్త పుస్తకం ఉందా ? ( మనసులో వీళ్ళు గనుక లేవండీ అంటే మళ్ళీ లైన్ లో ఉన్న షాప్ లన్నీ వెతుక్కోవాలి అన్న భయం ఉంది లోలోపల)
"ఉందండీ" అంటూ అందరికీ కనబడేటట్టు పెట్టి ఉంచిన బుక్ తీసుకొచ్చి ఇచ్చారు . హమ్మయ్య ఒక పని అయిపొయింది అనుకుంటూ ఇంకొన్ని పుస్తకాల కోసం వెదుకుతూ ఒక పావుగంట శీతల పవనాలని ఆస్వాదించి కొన్ని కొసరు పుస్తకాలు కొనుక్కుని బయట పడ్డాను.
ఆరోజు సాయంత్రమే చదవడం మొదలెట్టాను .
కథలు ఎవరు వ్రాస్తారు ? జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు , రోజూ వారి పనులు విషయాలు గుర్తు పెట్టుకోలేని వాళ్ళు , చిలవలు పలవులు ఊహించుకునే వాళ్ళు. నాకు రుజువు దొరికేసింది చెల్లెలు పుట్టినరోజున ఎదురుగా కొత్తబట్టల్లో కనబడినా ఆ సంగతే గుర్తు ఉండదు చిన్నప్పుడెప్పుడో నాయనమ్మ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మెదడు.
కథ వ్రాయడానికి ముందు ఏం వ్రాస్తారు? అవును .. నేను ఏమి వ్రాస్తాను ? బ్లాగ్ లో ఏదో ఒకటి వ్రాస్తాను . అలా వ్రాస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కథ వ్రాసేస్తాను అనుకుంటూ మళ్ళీ ఆగిన దగ్గరనుండి . చదవడం మొదలెట్టి అప్పటికి ఒకగంట పది నిమిషాలు అయింది. కథలెందుకు రాస్తారు ? నాలుగో అధ్యాయంలోకి వచ్చాను . ఒక్క వాక్యం దగ్గర ఆగి పోయి మళ్ళీ చదివాను .
కనుక మనం ఏదైనా చెప్పాలనుకున్నామంటే ఆ చెప్పేది, చెప్పాలనుకునేది ఏదీ వృధా అయి ఉండకూడదు అన్న వాక్యం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వృధా అయినవి ఏమైనా వ్రాయడం అంటే... చెక్ చేసుకోవాలి మనం వ్రాసిన వాటిని వెనక్కి మళ్ళి ...మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అప్పుడు వృధా అయినది తొలగించి వేస్తాం. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అదే సెల్ఫ్ ఎడిటింగ్ అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారిపోయాను. ఉలిని శానం మీద సాది సాది ఉలిని పట్టుకోవడమేలాగో తెలిసినవాడు, కొయ్యని తొలిచినట్టు ఇలా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను కూడా !
తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ...
కథ వ్రాయడానికి ముందు ఏదో ఒక రచయిత కథని చూస్తూ మనమూ అదే కథని తెల్లకాగితం మీద వ్రాయాలి అది అనువాద కథైతే మరీ మంచిది అని చదివాను
అనువాద కథని ఎక్కడనుంచి తేవాలిప్పుడు ? విపుల లో ఏదో ఒక కథని ఉన్నపళంగా వ్రాసేయాలి . అయ్యో ! విపుల ఎక్కడిది ? మంచి ఐడియా తట్టింది .ఆన్ లైన్ పత్రిక ఉంది కదా అని . అలా ఆన్లైన్ పత్రిక తెరిచి ఓ కథని వ్రాస్తున్నప్పుడు ఈ అనువాద రచయిత వ్రాసిన ఈవాక్యాన్ని ఇలా కూడా వ్రాయవచ్చునే ,పర్యాయ పదం కూడా వాడవచ్చునే అనే ఆలోచన మనకి వస్తుందన్నమాట. ( అప్పటికప్పుడు ఇది నా అభ్యాసంలో నేర్చుకున్న విషయం )
అలా చదవడం ద్వారా కల్గిన ఒక్కో అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ ఆక్టోపస్ లాంటి స్నేహితులకి చిక్కకుండా .. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని ఆరు రోజులో ఆ పుస్తకాన్ని చదవడం పూర్తీ చేసాను . ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రయాణం అసలు సరిగ్గా సాగనే లేదు . 28 శీర్షికలున్న అ పుస్తకాన్ని ఒక్కో శీర్షిక చదువుతున్నప్పుడల్లా మధ్యలో ఆగి ఆలోచించడం అనివార్యమైంది.ఎంతమంది రచయితలని ఎన్ని కథలు పరిచయం చేసారు. ఒకోసారి చదువుతున్న ఆ పుస్తకం పక్కన పడేసి అందులో పరిచయం చేసిన కథల కోసం ఆన్ లైన్ లో అన్వేషించాను కూడా !
.
ఇలా ప్రతి అధ్యాయం చదువుతున్నప్పుడు నాకంటూ కల్గిన జ్ఞానోదయాలు, జ్ఞాపకం వచ్చిన విషయాలు, అరె ఈ విషయం భలే వ్రాసారు ఇంతగా మనసులని చదివినట్టు వ్రాయడం ఎలా సాధ్యమవుతుందో !మనం కూడా ఇలా వ్రాయడానికి తగినంత సాధన చేయాలి అనుకోవడం సాధారణం అయిపోయింది. ప్రతి శీర్షిక చదివేటప్పుడు నాకు కల్గిన ఆలోచనలు వ్రాయాలంటే అదొక పుస్తకం అయిపోతుంది కాబట్టి వాటిని దాచేసుకుని ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను .
ఈ పుస్తకం చదవడం వల్ల కల్గిన లాభాలు .
.
నేనూ కథలు వ్రాసే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ప్రతి శీర్షిక ఆసక్తిగానూ ఉంది, పాఠం లాగా కూడా ఉంది .ఇంతకు క్రితం కథలు వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు గురించి రెండు పుస్తకాలూ చదివాను, కొన్ని విషయాలు గ్రహించాను కానీ ఖదీర్ బాబు గారి "కథలు ఇలా కూడా రాస్తారు " అంటూ ఇంకో సరికొత్త పరిచయాన్ని ఇవ్వడం మాత్రం అద్భుతంగా ఉంది . ముఖ్యంగా ప్రతి అధ్యాయం చివర బోర్లా పడుకుని పుస్తకం చదువుకునే బొమ్మైతే చాలా నచ్చింది . పుస్తకం వ్రాయడం కన్నా పుట్ నోట్స్ అందించిన శ్రమ చాలా ఎక్కువని చెప్పారు. అది చాలా చాలా నిజం అనిపించింది. చాలామంది గురించి ఒక్క పుస్తకంలో తెలుసుకోవడం సులభంగా ఉంది.
అలాగే ప్రతి విభాగం చివరా చమక్ మనిపించే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం పట్టుకుని ఆలోచిస్తే చాలు ఎంతో విషయం అవగతమవుతుంది. అలాంటి వాక్యాలని ఒక్కో కొలికి పట్టుకుంటూ వెళితే ఒక గొలుసు అవుతుంది. అదే ఈ పుస్తకం అవుతుంది. అది చదవటం ద్వారా వచ్చిన అవగాహన, జ్ఞానం అవుతుంది అని నేను చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని చదివిన ఇంకొకరి అనుభంతో నా అనుభవాన్ని సరి పోల్చుకున్నాను.
ఈ పుస్తకం రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది.నాలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదివి ఎంత ఉపయుక్తంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం కూడా అవసరం . అది ఇచ్చే సంతృప్తి రచయితకి బలం.
ఇంతకు ముందు కథలు వ్రాయడం అలవాటు లేనివాళ్ళు హటాత్తుగా కీ బోర్డ్ ముందు కూర్చోవడం ఆశ్చర్యం కాదు.
నాలా ఎలాగోలా కథలు వ్రాస్తున్నవాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ కథలు వ్రాస్తారు . అది సాహిత్యలోకానికి చాలా మంచిది కదా !
ఇప్పటికే బాగా కథలు వ్రాసి ప్రసిద్ది చెందినవాళ్ళు ఇందులో అంశాలన్నీ భలే ఉన్నాయి . ఇవి మనకి ఒకప్పటి అనుభవమే కదా, అప్పుడు అలా జరిగింది, అలా వ్రాసాను ,తర్వాత సరిచేసుకున్నాం అని అనుకుంటారు కూడా .
ఔత్సాహిక రచయితలకి,కొత్తగా పుస్తకం విడుదల చేయాలి అనుకునేవాళ్ళకి ఎన్నో సలహాలు,సూచనలు ఉన్నాయి. వెరసీ ఇది వ్రాసే వాళ్ళకందరికీ ఓ గైడెన్స్ లాంటిది.
నా కథల ప్రయాణంలో మంచి కథలేమైనా వ్రాయగల్గితే "కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన అనుభవం తప్పకుండా ఉంటుంది .
ఇంత మంచి పొత్తం అందిందించిన మహ్మద్ ఖదీర్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు,ధన్యవాదాలు తెలుపుతూ ...

Sunday, 8 May 2016

ఆన్ బర్త్ డే ప్రెజెంట్

ఆన్ బర్త్ డే ప్రెజెంట్

ఇవే మేలు 
బోలెడు వస్తాయి 
రీ పే చేయక్కర్లేదు 
పుట్టినాక ఎన్నో సాదించాము 
కాని దాటిన ఆపద లు 
అన్ని తల్లి పేగు ఆశీస్సులే 
ఆ దీవెన కంటే ఆత్మీయం అయిన గిఫ్ట్ ఏముందని !

ఈ ఏడాది వేసిన అడుగులు ముందుకు వెళ్ళే స్ఫూర్తిని ఇస్తూ 
శతమానం భవతి 







Monday, 4 April 2016

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం కధల పుస్తకం మీద

దగ్గుబాటి పద్మాకర్ గారి అభిప్రాయం 
కధల పుస్తకం మీద 

ఖదీర్ బాబు రాసిన కొత్తపుస్తకం "కథలు ఇలా కూడా రాస్తారు" చదివాక 
ఇన్నికథలు ఇంతసాహిత్యం నేను చదవలేదే అని సిగ్గుపడలేదు గాని;
 ఇన్నికథలూ ఇంతసాహిత్యం ఖదీర్ బాబు చదివాడా అని అసూయపడ్డాను అన్నది నిజం!
ఈపుస్తకం రాయడం వెనక అతడి పరిశీలన, పరిశోధనలకన్నా
 "కథల గురించి తనకు తెలిసిన విషయాలను
 ఇతరులతో పంచుకోవాలనే తపనకి
 " ఒక డాక్టరేట్ ఇవ్వొచ్చు! ఎవరైనా యూనివర్సిటీవాళ్లు ఇచ్చినా అది నావరకు సంతోషమే.
ఈపుస్తకం ద్వారా ఖదీర్ బాబు ఔత్సాహిక రచయితలకు ఒక సిలబస్ సిద్ధం చేశాడని చెప్పొచ్చు!
 అలాగే కథ రాయాలనుకోగానే, ఒక ఆలోచన తట్టగానే తెల్లరేసరికల్లా కథరాసి పోస్టు చేసే వారికి
 "కథ రాయడం" ఇంత సీరియస్ విషయమా 
అని కళ్లు తెరిపించే అనేకవిషయాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
నావరకు నేను ఎన్నడూ చదవని, చదివే అవకాశం కూడారాని
 అనేకానేక ఉత్తమ కథల పరిచయాలు చదివే గొప్ప అవకాశాన్ని నాకు ఈపుస్తకం కల్పించింది. 
అన్ని చాప్టర్లలో కలిపి ఇలాంటి కథలు 100 పైగానే ఉన్నాయి.
"మంచి ప్రారంభాలూ... గొప్ప ముగింపులూ..." 
అనే చాప్టర్ కూడా అనేక ప్రారంభాలూ, 
ముగింపుల ఉదాహరణలతో ప్రతికథా రచయితకీ ఉపయోగపడేలా ఉన్నాయి.
ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదవొద్దని చెప్పినా...
 ఏక బిగిన చదివించేలా రాసినప్పుడు చదవకుండా ఉండడం ఎలాగో రచయిత చెప్పాలి కదా! smile emoticon 
ఒక పుస్తకాన్ని రాయడానికి రచయిత తీసుకున్న రిస్క్ లో ఒక్క శాతాన్ని పాఠకుడు
 తీసుకోలేక పోతాడా! అలాగని ఏక బిగిన చదవడం కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు! 
రెండో మూడో నాలుగో అయిదో కథలు రాసిన ఔత్సాహిక రచయితలు ప్రతి మూడునెల్లకీ 
డాక్టర్లు ఆల్బెండాజోల్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తిరగేస్తుండడం బెటర్. 
అప్పుడు పట్టుచీర కట్టిన భార్యని మళ్లిఒకసారి చూసినట్టు కొత్త ఉత్సాహం మొగ్గ తొడుగుతుంది!
అయితే ఫేస్ బుక్కులో సాహిత్య చర్చలుచేసేవాల్లపై
 ఖదీర్ బాబు అంతగా సదభిప్రాయాన్ని ప్రకటించలేదు ఈపుస్తకంలో! 
ఈ అభిప్రాయానికి కారణం అతడు ఫేస్ బుక్ కి దూరంగా ఉండడం వల్ల కావచ్చు
 లేదా అతడి పరిశోధనాత్మక భాద్యతలకి చర్చలు కామెంట్లు చికాకులు అనిపించి ఉండవచ్చు.
 ఇక్కడి కథా గ్రూపులో సవివరమైన చర్చలు చాలా జరిగాయని నా అభిప్రాయం.
 పత్రికల్లో చర్చలకి సలహాలకీ తావులేని వాతావరణంలో రచయితలు
 అనేకమంది తక్షణ అభిప్రాయాలకు మెసేజ్ బాక్సులు,
 కామెంట్ బాక్సులు వెతకడం వెనక ఎంతో ఇంటరాక్షన్
, ఆశ వుండడం నిజమని నా అభిప్రాయం. ఈ విషయంలో ఖదీర్ బాబు అభిప్రాయం
 వ్యక్తిగతమైనదిగా తీసుకోవచ్చు.
బహుశా ఒకపాట...
"నను నీ చెంతకు రప్పించే / గుణమే నీలో ఉన్నదనీ" లాగా 
ఫేస్ బుక్ లాగేస్తుందనే భయము ఉన్నట్టుంది!
తెలుగులో కథా సాహిత్యం విరబూయించ దలచిన వాల్లని ఆహ్వానిస్తూ 
తనదైన ఒక పుష్ప గుచ్ఛంతో ఆహ్వానించాడు! కథ పట్ల, కథా రచన పట్ల, 
మంచి కథా రచయితల పట్లా ఖదీర్ బాబు అభిమానాన్ని కౌగిలించుకోవాల్సిందే! 

Saturday, 2 April 2016

Monday, 28 March 2016

కధలు , ఖదీరుడి కబుర్లు

కధలు , ఖదీరుడి కబుర్లు 
కవిత పురుడు పోసుకొనేదాక 
అక్షరాల నొప్పులు తప్పవు 
అంటాడు ఒక కవి 

మరి కధకు అవేమి ఉండవా ! 
ఏమో మపాసా నో ,రావి శాస్త్రి నో 
చాసో నో ఎవరినో ఒకరిని అడగాలి . 
పాపం వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటె ... 
అయినా అడిగేవాళ్ళు ఎక్కడ ఉన్నారు 
లోపల వ్రాయాలి అనే తపన వెలిగే వాళ్ళు తప్ప 

కధా కష్టాలు అడుగులు వేసే కలాలకే 
అనుకుంటాము 
కాని పరుగులు తీస్తూ 
పదునెక్కిన కలాలకు కూడానా ! 
ఇవన్నీ తెలుసుకోవాలంటే 
''కధల పుస్తకం '' చదవండి 
ఖదీర్ బాబు కధల కబుర్లు ఆయన మాటల్లోనే 
చదవండి . పుస్తకాలు అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాల్లో లభ్యం