స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Tuesday, 9 April 2013

రచయిత లతో .....

ఫిబ్రవరి లో ''న్యూయార్క్ కధలు''ఆవిష్కరణ సభలో 
ఖదీర్ బాబు గారు ......కేశవ రెడ్డి గారు మరియు శ్రీ రమణ గార్ల తో ....


ఏప్రిల్ ఎనిమిది సాహిత్యపు పేజ్ లింక్ ఇక్కడ
8/4/2013 sakshi sahityam page link )


Monday, 1 April 2013

కధలు ...కధకులు

తెలుగు కధలు .....ఒక కధకుడు
ఎవరై ఉంటారు?
ఇంకెవరు  గతుకుల రోడ్డు లో కూడా సాఫీగా  కధనం చెయ్యగలవాడు
అమ్మ కష్టానికి పూచిన పూలని అక్షర జాజులుగా పూయించి
అమ్మ యాసలో జావళీలు పాడించ గల వాడు
మన ఖదీర్ బాబు గారు.
ఇంకా బోలెడు విశేషాలు సోమవారం సాక్షి ''సాహిత్యపు పేజ్'' లో
(పేజ్ కు లింక్ ఇక్కడ )

కధ అంటే పసి పాపలు అయిపోతారు .....
అక్షరాలతో పోరాడుతారు
కంటి పాపల అలసట లెక్క చేయకుండా
ఒక్కో భావాన్ని పేరుస్తూ....అదిగో వాళ్ళ మధ్య
తెలుగు కధ హాయిగా కేరింతలు కొడుతూ ...
దాదాపు ముప్పై మంది కధకులు ''చిలుమూరు''లో
ఒకటిగా చేరి చేసిన సందడి ......చదవండి.

Tuesday, 26 March 2013

కధా రచయితల సమావేశం


ఒక జ్ఞాపకం ....ఒక అపురూప కలయిక 
ఎన్ని కధలు రూపుదిద్దుకుంటున్నాయో భవిష్యత్తే చెప్పాలి :) 


కధా  రచయితలతో ఖదీర్ బాబు  గారు



Monday, 18 March 2013

అక్షరాల రంగులు అద్దుకున్న సాహిత్య కుసుమాలు

ఒక పుస్తకం లోని గొప్పదనం దాని మీద వ్రాసిన మంచి సమీక్ష మనకు
తెలియచేస్తుంది.ఇలాంటి మంచి సంగతులెన్నో సాహిత్యం గూర్చి మన ముందుకు
తెచ్చే సాహిత్యపు పేజ్....ప్రతీ సోమవారం సాక్షి పేపర్ లో చూడండి
(లింక్ ఇక్కడ )


Sunday, 3 March 2013

ఒక్క అడుగు ఆంద్ర జ్యోతి లో

మన అభిమాన రచయిత గూర్చి మనకు కొంత అయినా తెలుసుకోవాలి 
అని ఉంటుంది.ఇష్టం లేని వాళ్ళు చంద్రునిలో  మచ్చలే చూస్తారు.
నచ్చిన వారు చంద్రునిలో అందాన్ని చూస్తారు.జ్ఞానం 
ఎక్కడ ఉన్నా గౌరవించాల్సిందే.
ఇదిగో ఆయన మాటల్లోనే చూడండి ..........ఎవరికైనా జీవితం లో 
ప్రతి అడుగు ఆపాతమధురమే.....కాదంటారా ?

''ఆదివారం ఆంధ్రజ్యోతి లో పనిచేసేటపుడు .... ఒక మధుర జ్ఞాపకం . 
1997 లో ప్రూఫ్ లు దిద్డుతుంటే ....అనంత్ తీసాడు.
ఉమా నా బాస్.నా సీనియర్ పసుపులేటి.గీత.
జీతం ఎంతో తెలుసా?
rs,2700/-......''మన్ చాహే గీత్'' వ్రాసి ...ఇదిగో 
''దావత్''కధతో దేశం మీద పడ్డాను .......ఖదీర్ బాబు ''




Monday, 18 February 2013

''పతంజలి'' కి ఒక అంజలి

కధ అంటే హృదయం నుండి పొంగి బుగ్గ పై పడి చిట్లిన కన్నీటి చుక్క....
తన చిట్టి వేరు తో భూమిని నెట్టి నిలబడి కరుకుపడిన మట్టిని పెళ్లగించి బయటకు
వచ్చే చిన్ని విత్తనం.....
భాదితుల కేకలు ఎగరేసి ప్రపంచానికి చూపే జండా కర్ర....
రవి చూడని  బాధల్ని సైతం చూసి లోకానికి చూపే మౌన సాక్షి....
విప్లవాలను రగిలించే అగ్ని కణం.....
ఇవన్నీ కాక ఇదిగో ఇంకొక్క కధ ఉంది ఇక్కడ.....

ఎవరి ముక్కునైనా వేలెత్తి చూపి ప్రశ్నిస్తూ
''ఆడు మొగాడ్రా''అని శెబాష్ అనిపించుకొని రచయితల
తల గర్వంగా నిలిపిన కలం ....ఆ కలం పేరు ''పతంజలి''
పరిచయం అవసరం లేని కలం....ఖదీర్ గారి కలం నుండి
వ్రాలిన అక్షర సుమ మాల ....చదవండి.

(sameeksha link ikkada )


Thursday, 14 February 2013

మధుబాల కు నివాళి

ఇన్ని గుండెల్లో కొలువుండే మహారాణికి
గుండె ఎందుకు అనుకున్నాడు ఏమో దేవుడు....
బురదలోనే పద్మం వికసిస్తుంది
దరిద్రం కూడా ఓడిపోతుంది ఈ అందం ముందు అనుకున్నాడు ఏమో....
నలుపు తెలుపుల్లో దాగి ఉన్న ఈ ముగ్ద మోహన సౌందర్యం వెనుక ఉన్న
విషాద నీలి నీడలు....ఖదీర్ బాబు కలం నుండి ....
ఆ సుకుమార సౌందర్యానికి ఇదే ఆయన నివాళి
(మధుబాల నివాళి లింక్ ఇక్కడ)